హజ్రత్ ఫాతెమా[స.అ] సృష్టి దైవప్రవక్త[స.అ] మాటల్లో

మంగళ, 01/08/2019 - 15:42

హజ్రత్ ఫాతెమా[స.అ]ను అల్లాహ్ ఎలా సృష్టించాడు అన్న విషయం పై దైవప్రవక్త[స.అ] హదీస్ వివరణ.

హజ్రత్ ఫాతెమా[స.అ] సృష్టి దైవప్రవక్త[స.అ] మాటల్లో

దైవప్రవక్త[స.అ] హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] గారి సృష్టి గురించి ఇలా వివరించారు: “ఫాతెమా యొక్క కాంతి భూమ్యాకాశాల సృష్టి కన్న ముందు సృష్టించబడింది. అల్లాహ్ హజ్రత్ ఆదమ్‌ను సృష్టించకముందే ఫాతెమా[స.అ] ను తన కాంతితో సృష్టించాడు. ఫాతెమా కాంతి నింగిలో అల్లాహ్ స్తుతిలో నిమగ్నమై ఉండేది. అల్లాహ్ ఆదమ్ సంతతి పరంగా నన్ను సృష్టించినప్పుడు ఫాతెమా యొక్క ప్రకాసించే జ్యోతిని స్వర్గపు రేగిపండు(యాపిల్‌పండు) రూపంలో మార్చాడు. జిబ్రయీల్ దానిని నాకు ఇస్తూ ఇలా అన్నారు: “ఓ ముహమ్మద్! ఈ స్వర్గపు రేగిపండును అల్లాహ్ మీకు కానుకగా ప్రసాదించాడు” నేను దాన్ని తీసుకొని నా గుండెల మీద పెట్టుకున్నాను. “ఈ పండును తినండి” అని జిబ్రయీల్ అన్నారు. నేను దాన్ని చీల్చినప్పుడు దాని నుండి కాంతి ప్రకాశించింది, నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు జిబ్రయీల్ “ఓ ముహమ్మద్! తినండి, కంగారు పడకండి. ఈ కాంతి నింగిలో “మన్సూరహ్” మరియు భూమి పై “ఫాతెమా” అని పిలవబడతారు” అని అన్నారు. నేను “మిత్రమా జిబ్రయీల్! ఈ పేర్లకు కారణమేమిటీ? అని ప్రశ్నించాను. జిబ్రయీల్ దానికి సమాధానంగా ఇలా అన్నారు: “భూమి పై “ఫాతెమా” అని పిలవబడడానికి కారణమేమిటంటే ఆమెను అనుసరించేవారిని నరకాగ్ని నుండి వేరు చేస్తారు మరియు తన శత్రువుల నుండి ఆమె పట్ల ప్రేమను దూరం చేస్తుంది. ఆకాశంలో “మన్సూరహ్” అని పిలవబడడానికి కారణమేమిటంటే ఆమెను ఇష్టపడేవారిని సహాయం అందిస్తారు”[మఆనియుల్ అఖ్బార్, నస్, పేజీ396].

రిఫ్రెన్స్
సదూఖ్, మఆనియుల్ అఖ్బార్, దఫ్తరె ఇంతెషారాతె ఇస్లామీ వాబస్తె బె జామెఅ ముదర్రిసీనె హౌజయే ఇల్మియయె ఖుమ్, 1403ఖ.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31