ఇతరులను ఇస్లాము నుండి బేజారు చేయకండి!

గురు, 02/21/2019 - 19:14

ఇస్లాము మానవజాతికి రుజుమార్గాన్ని చూపటానికి మరియు వారి యొక్క అవసరాలను తీర్చటానికి పంపబడినది తప్ప వారికి ఏ విధమైన కష్టాన్ని కలుగజేయటానికి మాత్రము కాదు.  

ఇతరులను ఇస్లాము నుండి బేజారు చేయకండి!

ఈ కాలంలో కొంతమంది తామే ఈ లోకంలో నిజమైన ముస్లిములమని ఇతరులకు చూపటానికి మరియు ఇతరులను చిన్న చూపు చూస్తూ ఇస్లామును మరియు దాని ఆచరణలను ఏదో కష్టమైనవిగా ఇతరులకు చూపించటానికి కృషి చేస్తారు,కానీ నిజంగా చూస్తే ఇస్లాము మరియు దాని బోధనలు మానవులకు వారి సమస్యలకు పరిష్కారంగా అవతరింపబడ్డాయి తప్పా వారిని ఇంకా కష్టాల్లోకి నెట్టడానికి లేదా వారికి భారంగా మాత్రము కాదు.
ఆ అల్లాహ్ పవిత్ర ఖురానులో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి  మించిన భారం వేయడు.అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది,మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది”[అల్ బఖర/286].
దైవప్రవక్త[స.అ]ల వారి కాలంలో ఒక వ్యక్తి రోజంతా చెట్లకు నీళ్ళు పోసి (అలిసి), మ ఆజ్ బిన్ జబల్ వెనుక జమాతులో నమాజు కొరకు నిలబడ్డాడు, మ ఆజ్ నమాజులో బఖరా సూరాను  పఠించటం మొదలుపెట్టెను అది చూసి జమా అతులో నిలబడే శక్తి లేని ఆ వ్యక్తి,జమా అతును వదిలి తన నమాజును పూర్తిచేసాడు,అప్పుడు తన నమాజును పూర్తి చేసిన మ ఆజ్ నీవు మా పట్ల కపటము కలిగిన వాడవు (ఎందుకంటే) నీవు మా జమా అతునుండి నిన్ను వేరుచేసుకున్నావు అని అన్నాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న దైవప్రవక్తలవారు ఏ విధంగా కోపోద్రిక్తులైయ్యారంటే ఆ విధంగా ఎప్పుడూ వారిని ఎవరూ  చూడలేదు,అప్పుడు మ ఆజ్ తో ఈ విధంగా అన్నారు: నీవు ఇతర ముస్లిములను భయపెడుతున్నావు మరియు వారిని ఇస్లాము నుండి బేజారు చేస్తున్నావు కానీ జమా అతు యొక్క వరుసలలో రోగులు,బలహీనులు,వ్రుద్దులు,పనిచేసే వాళ్ళు నిలబడి ఉన్నారని నీకు తెలియదా? జమా అతు ద్వారా(ఒక సమూహంగా) చేసే పనులలో బలహీనుల శక్తిసామర్ధ్యాలను కూడా గుర్తుంచుకోవాలి,చిన్న పాటి సూరాలను ఎందుకు పఠించలేదు? అని అన్నారు.

రెఫరెన్స్
ఎక్ సదొ బీస్త్ దర్సె జిందగీయే హజ్రత్ మొహమ్మద్[స.అ].         

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29