తౌబహ్ ఖుర్ఆన్ దృష్టిలో

శుక్ర, 02/22/2019 - 18:36

పవిత్ర ఖుర్ఆన్ యొక్క ఆయతుల ద్వార తౌబహ్(పశ్చాత్తాపం)కు సంబంధించిన కొన్ని అంశాల వివరణ సంక్షిప్తింగా.

తౌబహ్ ఖుర్ఆన్ దృష్టిలో

సాధరణంగా ఖుర్ఆన్ లో అల్లాహ్ శిక్ష ప్రస్తావన ఉన్న ఆయత్ల తరువాత “తౌబా చేసిన వారు తప్ప” అన్న వాక్యం కనిపిస్తుంది. దానికి అర్ధమేమిటంటే సరిదిద్దుకునే మార్గం తెరవబడే ఉంది అని. ఖుర్ఆన్ ఆయతుల ద్వార తౌబహ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం:
1. తౌబహ్, విధి, అది వాజిబ్ చర్య. అల్లాహ్ తౌబహ్ చేయమని ఆదేశిస్తున్నాడు.[తహ్రీమ్:8]
2. నిజమైన తౌబహ్ తప్పకుండా అంగీకరించబడుతుంది.[షూరా:37, బఖరహ్:37]
3. అల్లాహ్ తౌబహ్ ను అంగీకరించడమే కాకుండా వారిని చాలా ఇష్టపడతాడు.[బఖరహ్:222]
4. తౌబహ్, ముక్తికి మార్గం.[నూర్:31]
5. తౌబహ్ చెడును మంచిగా మర్చేస్తుంది.[ఫుర్ఖాన్:70]
6. తౌబహ్ వర్షం కురవడానికి కారణం.[హూద్:52]
7. తౌబహ్ మంచి భాగ్యానికి కారణం.[హూద్:3]
8. మృత్యువు లక్షణాలు సంభవించిన తరువాత తౌబహ్ అంగీకరించబడదు.[ఇన్సాన్:18]
9. తౌబహ్ చేసిన వారి పై అల్లాహ్ దయ చూపుతాడు.[బఖరహ్:37, అన్ఆమ్:54, తౌబహ్:117, మర్యమ్:60]
10. అల్లాహ్ దృష్టిలో తౌబహ్ చేయకపోవడం అన్యాయం మరియు నాశనానికి కారణం.[హుజురాత్:11, బురజ్:10]  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17