సహనమూర్తులు

ఆది, 07/29/2018 - 15:39

సబ్ర్, అనగా సహనం, సాబిర్ అనగ సహనశీలి. అల్లాహ్ పరీక్షలో సహనం చూపిన వారికి అల్లాహ్ తరపు నుండి శుభవార్త ఉంది.

సహనమూర్తులు

అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా ప్రవచించెను: “మేము ఏదో ఒకవిధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము-భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహానమూర్తులకు శభవార్త ఇవ్వండి”[బఖరహ్:155].
అల్లాహ్, మానవులందరిని పరీక్షిస్తాడు, కాని అందరిని పరీక్షించే విధానం మాత్రం సమానంగా ఉండదు. ఈ ప్రపంచం పరీక్షాస్థలం. ఇందులో అల్లాహ్ అందరికి పరీక్ష పెడతాడు, చివరికి ప్రవక్తలను కూడా పరీక్షిస్తాడు. అల్లాహ్ యొక్క పరీక్ష గుప్త మరియు సందేహాలను తెలుసుకోవడానికి కాదు, మనిషిలో ఉన్న ప్రావిణ్యతను బయటకు తీసి దానిని పెంచడానికి మాత్రమే. అల్లాహ్ యొక్క పరీక్ష అంశాలు ఈ ప్రపంచంలో సంభవించే తీపి మరియు చేదు సంఘటను అవి ఆకలి రూపంలో కానివ్వండి అవి భయం లేదా నష్టం రూపంలో కానివ్వండి.
అల్లాహ్ సహనమూర్తుల గురించి ఇలా ప్రవచించెను:  వారి(సహనమూర్తుల)కెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖద్దుగా అల్లాహ్ కు చెందిన వారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు.[బఖరహ్:156]. వారి(సహనమూర్తుల) పై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.[బఖరహ్:157]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
19 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9