సల్మాన్ మరియు విలాయత్ రక్షణ

శని, 03/09/2019 - 17:41

దైవప్రవక్త[స.అ] తరువాత ఇమామ్ అలీ[అ.స] ఖిలాఫత్ విషయంలో జరిగిన అన్యాయాన్ని ఎదురుకునే వారిలో ప్రముఖ వ్యక్తి జనాబె సల్మాన్.

సల్మాన్ మరియు విలాయత్ రక్షణ

సల్మాన్ దైవప్రవక్త[స.అ] తరువాత ఇమామ్ అలీ[అ.స] ఖిలాఫత్ విషయంలో జరిగిన అన్యాయాన్ని ఎదురుకునే వారిలో ఒకరు. వారు ఇమామ్ అలీ[అ.స] దైవప్రవక్త[స.అ] యొక్క నిజమైన ఖలీఫా మరియు ఉత్తరాధికారి అని ఒక్క క్షణం కూడా సందేహించకుండా ఆయన పట్ల విధేయతను చాటుకున్నారు. వీలుదోరికితే చాలు యదార్థాలను చెప్పి ముస్లిములకు ఇమామ్ అలీ[అ.స] వైపుకు రమ్మని పిలిచేవారు. నిరంతరం వారు దైవప్రవక్త[స.అ] ఈ మాటను ప్రజల కోసం చెబుతూ ఉండేవారు: “నిస్సందేహంగా అలీ అల్లాహ్ యొక్క తెరిచిన ద్వారము. అందులో ప్రవేశించినవాడు విశ్వాసి మరియు దాని నుండి బయటకు వెళ్ళిపోయిన వాడు అవిశ్వాసి”[కితాబు సులైమ్ ఇబ్నె ఖైస్, పేజీ251] అలాగే “అలీ ఈ ఉమ్మత్ యొక్క అతిఉత్తమ వ్యక్తి”[ఆయానుష్షిఅహ్, భాగం7, పేజీ287]
సల్మాన్ ఒక ఉపన్యాసంలో ఇలా అన్నారు: “ప్రజలారా! విలాయత్ ను మీ మధ్య శిరస్సుగా నిర్ధారించండి” అంటే అహ్లెబైత్[అ.స] యొక్క విలాయత్ లేకుంటే, నిజమైన ముస్లిం కాలేవు మరియు నీ మతం నీకు లాభాన్ని చేకూర్చదు అని అర్థం.[బహ్జతుల్ ఆమాల్, భాగం4, పేజీ418]
“ఇబ్నె అబ్బాస్” సల్మాన్ ను కలలో చూసి అతనితో ఇలా ప్రశ్నించారు: స్వర్గంలో అల్లాహ్ మరియు దైవప్రవక్త[అ.స] పట్ల విశ్వాసం తరువాత ఏది ఉత్తమైనది? సల్మాన్ ఇలా సమాధానమిచ్చారు: “అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] పట్ల విశ్వాసం అనంతరం ఏదీ విలువైనది మరియు ఉత్తమమైనది లేదు అలీ ఇబ్నె అబీతాలిబ్ విలాయత్, వారి పట్ల ప్రేమ మరియు వారి అనుచరణ తప్ప”[బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ341].

రిఫ్రెన్స్
కితాబు సులైమ్ ఇబ్నె ఖైస్, ఆయానుష్షిఅహ్, బహ్జతుల్ ఆమాల్, బిహారుల్ అన్వార్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13