నిజమైన వీరుని యొక్క లక్షణం

శుక్ర, 04/26/2019 - 19:21

దైవప్రవక్త(స.అ.వ)ల వారి నోట నిజమైన వీరుని యొక్క లక్షణం.

నిజమైన వీరుని యొక్క లక్షణం

ఒకరోజు దైవప్రవక్త(స.అ.వ)ల వారు ఇమాం అలి(అ.స)తో "ఒకవేళ నీవు ఎవరినైనా బహిరంగంగా నీతిమాలిన పనికి(పాపానికి) పాల్పడటాన్ని చూస్తే ఏమి చేస్తావు?'' అని ప్రశ్నించారు. దానికి ఇమాం అలి(అ.స) "నేను ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతాను" అని సమాధానమిచ్చారు. దైవప్రవక్త(స.అ.వ) "మరోసారి అతనినే మరలా అదేవిధంగా పాపానికి పాల్పడుతూ చూస్తే ఏం చేస్తావు?" అని ప్రశ్నించారు, దానికి ఇమాం అలి(అ.స) "అయినా సరే నేను దాన్ని రహస్యముగానే  ఉంచుచాను" అని సమాధానమిచ్చారు. దైవప్రవక్త(స.అ.వ) మూడు సార్లు అదే ప్రశ్నను పునరావృతం చేశారు, దానికి ఇమాం అలి(అ.స) అదే విధంగా సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త(స.అ.వ) ఈ విధంగా సెలవిచ్చారు: "అలి(అ.స) కన్నా వీరుడు(ఈ లోకంలో) ఎవడూ ఉండజాలడు". వీరత్వమంటే ఇతరులను చిన్నచూపు చూడటం వారి తప్పులను చూపించి వారిపై తమ అధికారాన్ని చలాయించటం కాదు. దైవప్రవక్త(స.అ.వ)ల వారి దృష్టిలో వీరత్వమంటే ఇతరుల తప్పులను రహస్యంగా ఉంచే విశాలమైన హృదయం కలిగి ఉండటం.

రెఫరెన్స్:ముస్తద్రకుల్ వసాయెల్,12వ భాగం,పేజీ నం:426.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Rajjab Basha on

Masha Allah. Kya kahna Rasool sawa ka aur Ali AS ka

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5