దైవప్రవక్త[స.అ] సహచరుల లక్షణాలను పాటిస్తే తప్పకుండా మనం సాఫల్యం పొందుతాము...
![దైవప్రవక్త[స.అ] సహచరుల లక్షణాలు](https://te.btid.org/sites/default/files/field/image/12_0.jpg)
దైవప్రవక్త[స.అ] సహచరుల లక్షణాలలో ఒకటి జనంలో ఐక్యమత్యాన్ని పెంచడం
ఖుర్ఆన్, దైవప్రవక్త[స.అ] సహచరుల కొరకు కొన్ని లక్షణాలను సూచించింది. వాటిని మనం కూడా పాటిస్తే తప్పకుండా మన రుజుమార్గ మరియు ఐక్యమత్య ప్రచారంలో సహాయపడతాయి. అవి:
1. అవిశ్వాసుల పట్ల కఠోర ప్రవర్తన, అనగా వారి ప్రభావం పడకుండా అడ్డుకోవటం మరియు ఐక్యమత్యాన్ని దెబ్బతీసే ఎటువంటి ప్రయత్నమైన సరే వారిని క్షమించకపోవటం.
2. తమ విశ్వాసపరమైన సోదరుల పట్ల దయా, త్యాగం మరియు సహాయం చేయు గుణం కలిగి ఉండటం.
3. పూర్తి జ్ఞానంతో మరియు ఇష్టంతో అల్లాహ్ ను ఆరాధించటం. వారు అంధత్వ ఆరాధనలు మరియు ఎవరికో చూపించడాకై ఆరాధించేవారు కాదు. తెలుసుకొని జ్ఞానంతో కూడి ఉన్న మరియు ఇష్టంగా చేసే ఆరాధన మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది మరియు మనిషిని ఒక గొప్ప విశ్వాసునిగా తీర్చిదిద్దుతుంది.
వ్యాఖ్యానించండి