అలీ[అ.స] లేని ఇజ్మా విలువ లేనిది

మంగళ, 01/14/2020 - 14:22

అబూబక్ర్ బైఅత్ పై ఇజ్మా ఉంది అని అంటారు కాని ఆ ఇజ్మాలో అలీ[అ.స] లేరు, వారు లేని ఇజ్మా విలువ లేనిది...

అలీ[అ.స] లేని ఇజ్మా విలువ లేనిది

అబూబక్ర్ ఖిలాఫత్ పై ఇజ్మా నిదర్శనం ఉంది అని ఎలా చెప్పగలరు? నిజం చెప్పాలంటే కేవలం ఒక అలీ ఇబ్నె అబీతాలిబే[అ.స] ఆ ఇజ్మాలో పాల్గోకపోవడమే ఇజ్మాకు విలవలేకపోయింది, ఎందుకంటే దైవప్రవక్త[స.అ] తరపు నుండి అతని గురించి స్పష్టమైన ఆదేశం లేదునుకుందాం అయిన సరే అతను ఆ ఖిలాఫత్ పదవికి అభ్యర్థి కాబట్టి. అలాంటిది ఇంత మంది పెద్ద పెద్ద సహాబీయులు పాలుగోలేని ఈ ఇజ్మా యధార్థం ఏమిటి?
యధార్థం ఏమిటంటే అబూబక్ర్ యొక్క బైఅత్ ఎవరి సలహా లేకుండా, ముస్లిముల నిర్లక్ష్య మరియు అశ్రద్ధ పరిస్థితిలో జరిగిపోయింది. ఆ సమయంలో సమస్యలను పరిశీలించి పరిష్కరించే పెద్దలు దైవప్రవక్త[స.అ] గారి అంతిమ సంస్కార పనులలో లీనమై ఉన్నారు. మదీనా వాసులకు అకస్మాత్తుగా దైవప్రవక్త[స.అ] మరణ సంఘటను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తరువాత వాళ్ళపై దౌర్జన్యంతో ఈ బైఅత్ పట్ల బలవంతం చేశారు.( తారీఖుల్ ఖులఫా, భాగం 1, పేజీ 18) వాళ్ళ బలవంతానికి పరిణామం ఫాతెమా[స.అ] ఇంట్లో ఉన్న వాళ్ళు అబూబక్ర్‌తో బైఅత్ చేయడానికి ఇంటి నుండి బయటకు రాకపోతే నిప్పంటిస్తామనే హెచ్చరికతోనే అర్ధం చేసుకోవచ్చు.

రిఫ్రెన్స్
తారీఖుల్ ఖులఫా, ఇబ్నె ఖుతైబహ్, ఖిలాఫత్ అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27