గదీర్ పండగ షియా ముస్లిములు సృష్టించుకున్న దినము, అని చెప్పేవారికి సమాధానం...
ప్రశ్న: గదీర్ పండగ షియా ముస్లిములు సృష్టించుకున్న దినమా?
జవాబు: నవీరీ మరియు మఖ్రీజీలు గదీర్ రోజు పండగ జరుపుకోవటాన్ని బిద్అత్ గా భావిస్తారు. వారు ఇలా అంటారు: షియాలు, హిజ్రీ యొక్క 4వ సంవత్సరం(352 హిజ్రీ), జిల్ హిజ్జ్ మాసం దైవప్రవక్త మరియు అలీ మధ్య జరిగిన సోదర ప్రమాణాన్ని అలీ ను దైవప్రవక్త తన ఉత్తరాధికారిగా నియమించారు అని భావిస్తారు.
కాని ఇబ్నె మస్ఊద్(మరణం346) ‘అల్ తన్బీహ్ వల్ అష్రఫ్’ గ్రంథంలో ఇలా ఉల్లేఖించారు: “అలీ[అ.స] యొక్క సంతానం మరియు వారి షియాలు ఈ(18 జిల్ హిజ్) రోజును గౌరవిస్తారు”
ఫయ్యాజ్ ఇబ్నె ఉమర్ తూసీ హీజ్రీ యొక్క 259వ సంవత్సరంలో ఇలా అన్నారు: “ఇమామ్ రిజా[అ.స] (మరణం203హిజ్రీ) ఈ రోజును పండుగగా భావించేవారు.[అల్ గదీర్, పేజీ81]
రిఫరెన్స్
అల్లామా షేఖ్ అబ్దుల్ హుసైన్ అమీనీ, గుజీదెయీ అజ్ అల్ గదీర్, తర్జుమా ముహమ్మద్ హుసైన్ షఫీయీ షాహ్రూదీ, మొఅస్ససయె మీరాసె నుబువ్వత్, చాప్3.
వ్యాఖ్యానించండి