ఇమామ్ హుసైన్(అ.స) లక్షణాలు

మంగళ, 03/23/2021 - 09:06

ఇమామ్ హుసైన్(అ.స), యదార్ధాన్వేషికి మంచి మార్గదర్శి అని వివరిస్తున్న కొన్ని లక్షణాలు..

ఇమామ్ హుసైన్(అ.స) లక్షణాలు

అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల మార్గదర్శకం కోసం వివిధ అనుగ్రహాలతో పాటు దైవప్రవక్త(అ.స)ను పంపించి, ఆకాశ గ్రంథాలను అవతరింపజేసి, ఆలోచన శక్తి ప్రసాదించి మరియు సజ్జనుల జీవితాన్ని ఆదర్శంగా సూచించాడు. వారి నడవడికను మనిషి ఆదర్శంగా చేసుకుంటే, అతడు పరిపూర్ణ స్థాయికి చేరగలడు. దైవప్రవక్త(స.అ) అవతరింపజేసి వారిని ప్రజల కోసం ఆదర్శంగా సూచించేను. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యత్తమ ఆదర్శం ఉంది”[సూరయె అహ్జాబ్, ఆయత్21]
దైవప్రవక్త(స.అ) మరణానంతరం మోక్షం మరియు పరిపూర్ణ స్థాయి చేరడానికి ఆదర్శం వారి నిజమైన ఉత్తరాధికారుల జీవితం. అల్లాహ్ దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్(స.అ)ల విధేయతను విధిగా నిర్ధారించెను, ఖుర్ఆన్ లో వివిధ సందర్భాలలో దీనిని సూచించెను.
ఇక్కడ దైవప్రవక్త(స.అ) యొక్క రెండవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ హుసైన్(అ.స) యొక్క నైతిక స్వభావాన్ని మీకోసం వివరించాలనుకుంటున్నాము:
ఇమామ్ హుసైన్(అ.స) యదార్ధాన్వేషికి మంచి మార్గదర్శి
ఇమామ్ హుసైన్(అ.స), సులైమాన్ ఇబ్నె సురదె ఖజాయీ, మరికొంతమంది సహచరులకు మరియు విశ్వాసులకు పంపించన ఉత్తరంలో ఇలా వ్రాశారు: “నీ రీతి మాకోసం ఆదర్శం”.[1]
అలాగే ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) కూడా ఇమామ్ హుసైన్(అ.స)ను అముల్యమైన ఆదర్శంగా పరిచయం చేశారు: “హుసైన్(అ.స) నాకు ఆదర్శం”[2]
ఇమామ్ హుసైన్(అ.స) నైతిక స్వభావాలు
1. స్వచ్చత మరియు అల్లాహ్ ను కేద్రీకముగా భావించడం:
ఇస్లాం యొక్క బోధనలలో చాలా ముఖ్యమైనది, ఖుర్ఆన్ మరియు హదీసులలో చాకీదు చేయబడిన అంశం చేసే అమలులో స్వచ్చత మరియు అల్లాహ్ కొరకు మాత్రమే చేయాడం. అల్లాహ్ తౌహీద్ ను విశ్వసించే ముస్లిం, ఇస్లాం మార్గంపై నడిచేవారికి తెలుసు; తన జీవిత లక్ష్యం కేవలం అల్లాహ్ ను సంతోషపరచడం మరియు ఆయన సామిప్యం పొందడం. ఈ విధంగా నడుచుకునే వర్గం లేదా ఒక సమూహం ఎప్పటికీ అల్లాహ్ నియమించిన హద్దులను దాటి ప్రవర్తించడు. తనను పూర్తిగా అల్లాహ్ కు లొబడి ఉంటాడు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా వివరించెను: ఈ విధంగా ప్రకటించు: “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవినం, నా మరణం-ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే”[సూరయె అన్ఆమ్, ఆయత్162]
ఇమామ్ హుసైన్(అ.స) యొక్క జీవితాన్ని పరిశోధించినట్లైతే వారి పవిత్ర జీవితంలో ఈ స్వభావాన్ని గొప్ప స్థానంలో చూడవచ్చు. ఇమామ్ హుసైన్(అ.స) తన ప్రాణత్యాగాలకు ముందు కూడా అల్లాహ్ కోసం అనే మాటలు నోటనుండి వచ్చింది. అంతేకాదు నిత్యం వారి నోటి ఇదే దుఆ ఉండేది: “అల్లాహ్ పేరుతో, అల్లాహ్ సహాయంతో, అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో మరియు అల్లాహ్ అవతరించిన ధర్మం విధేయత పై, అల్లాహ్ ను నమ్ముతాను, శక్తివంతుమైన అల్లాహ్ ప్రసాదించిన శక్తితో, నిస్సందేహంగా నేను నా ప్రాణాలను నీకు అర్పిస్తున్నాను, నేనూ నా చర్యలూ నీకు సొంతం, నేను నిన్ను కోరేది ఒక్కటే నన్ను ఇహపరలోకాలలో నీకు ఇష్టం కాని చర్యల నుండి నన్ను కాపాడు”[3]
2. ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సహనం మరియు ఔదార్యం:
కర్బలా మరియు ఆషూరా యదార్థగాద గురించి తెలిసిన వారికి ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సహనం మరియు ఔదార్యం గురించి తెలియకుండా ఉండదు. హజ్రీ యొక్క 61 సంవత్సరంలో వారి పై జరిగిన ఘాతకం పట్ల సహనశీలత్వాన్ని ప్రదర్శించడం ప్రతీ ఒక్కరికి సాధ్యం కానిపని. యుద్ధభూమిలో షిమ్ర్ వారి శిరస్సును వేరు చేసేటప్పుడు చెసిన మాటల ద్వార స్ర్తోత్రముల ద్వారా వారి సహనం మరియు ఔదార్యాన్ని తెలుసుకోవచ్చు. వారు చివరి క్షణాలలో ఇలా అన్నారు:
صبراً على قضائك یا رب لا اله سواك یا غیاث المستغیثین‏ مالى رب سواك و لا معبود غیرك صبراً على حكمك یا غیاث من لا غیاث له یا دائماً لا نفاذله، یا محیى الموتى، یا قائماً على كل نفس بما كسبت، احكم بینى و بینهم و انت خیرا الحاكمین[4]

3. ఇమామ్ హుసైన్(అ.స) ధైర్యసాహసాలు:
అబ్దుల్లాహ్ ఇబ్నె ఖైస్ సిఫ్ఫీన్ యుద్ధం లో ఇమామ్ హుసైన్(అ.స) ధైర్యసాహసాలను వివరిస్తూ ఇలా అన్నారు: సిఫ్పీన్ యుద్ధంలో ఇమామ్ అలీ(అ.స) సైన్యంలో ఉన్నాను. ముఆవియహ్ సైన్యాధిపతి అయిన అబూఅయ్యూబె సలమీ తన సైన్యం సహాయంతో ఫురాత్ కాలువ పై కబ్జా చేసి మాకు నీరు లేకుండా చేశారు. దప్పిక తీవ్రత వల్ల అలీ(అ.స) సైన్యం వారిని ఫిర్యాదు చేశారు. హజ్రత్ అలీ(అ.స) శత్రుసైన్యం వద్దకు పంపించారు, ఫలితం దక్కలేదు. ఈ సమస్య ఇమామ్ నిరాశ పరిచింది. అప్పుడు ఇమామ్ హుసైన్(అ.స) ఇలా అన్నారు: నాన్నగారు! నీళ్ళు వదలమని చేప్పడానికి నన్ను వెళ్లమంటారా? అలీ(అ.స) ఇలా అన్నారు: అలాగే వెళ్లు బాబూ. ఇమామ్ హుసైన్(అ.స) కొంతమందిని వెంటబెట్టుకొని శత్రువులపై దాడి చేశారు, ఫురాత్ కాలువ పై వున్న శత్రువుల ముట్టడిని తొలగించారు, అక్కడ డైరా వేసి కొందరిని కాపాలాగా ఉంచి తండ్రి వద్దకు వచ్చి వారి విజయాన్ని తెలియపరిచారు. ఇమామ్ అలీ(అ.స) నీళ్ల పై ఉన్న ముట్టడిని తొలగించిన వార్త విని ఏడ్చేశారు. ఇమామ్ అలీ(అ.స)తో కొందరు ఇలా అన్నారు: యా అలీ! ఈ యుద్ధంలో హుసైన్(అ.స) ద్వార మనకు దక్కిన మొదటి విజయం, అలాటప్పుడు మీరెందుకు ఏడుస్తున్నారు?! ఇమామ్ ఇలా అన్నారు: ఔను, నిజమే, కానీ నాకు ఆషూరా రోజు గుర్తొచ్చింది, ఆరోజు హుసైన్ నీరు లేకుండా తీవ్ర దాహంతో ఉండగా చంపబడతారు. వారిపై జరిగే ఘాతకాన్ని చూసి వారి గుర్రం అరుస్తుంది మరియు ఇలా అంటుంది: వారి ప్రవక్త కుమార్తె యొక్క కుమారుడ్ని చంపిన ఉమ్మత్ ను నాశనం చేయి.[6]

రిఫరెన్స్
1. మకాతీబుల్ అయిమ్మహ్(అ.స), భాగం3, పేజీ143
2. కామిలుజ్జియారాత్, పేజీ65
3. మహ్జుద్దఅవాత్ వ మన్హజుల్ ఇబాదాత్, పేజీ157
4. రియాజుల్ మసాయబ్, పేజీ33
5. మదీనతుల్ మఆజిజ్, భాగం3, పేజీ139
             

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9