రజ్అత్-2

సోమ, 11/22/2021 - 16:39

రజ్అత్ గురించి ఖుర్ఆన్ లో ఉందా లేదా అన్న విషయంపై సంక్షిప్త వివరణతో పాటు మునుపటి ఉమ్మత్ లలో ఇలా జరిగిందా లేదా అన్న అంశాలు...

రజ్అత్-2

ఒకవేళ సున్నీయులు “రజ్అత్”ను విశ్వసించకుంటే!, వాళ్ళకు ఇలా చేసేందుకు పూర్తి హక్కు ఉంది. కాని ఎవరైతే రజ్అత్‌ను విశ్వాసిస్తున్నారో వాళ్ళను దూషించే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ విశ్వాసం స్పష్ట ఆదేశాల ద్వార రుజువు అయ్యి ఉంది. తెలియని వాడు తెలిసిన వాడి పై అభ్యంతరం వ్యక్తం చేయ కూడదు. మరి అలాగే అజ్ఞానికి జ్ఞాని పై అభ్యంతరం చేసే హక్కు లేదు. ఒక విషయం పై విశ్వాసం లేకపోవడం ఆ విషయం అసత్యం అని ఏమాత్రం కాదు. ముస్లిముల వద్ద ఎన్నో గట్టి సాక్ష్యాలు ఉన్నాయి కాని వాటిని యూధులు మరియు క్రైస్తవులు అంగీకరించరు. స్వయంగా అహ్లెసున్నతుల యొక్క విశ్వాసాలు మరియు ఎన్నో రివాయతులు –ముఖ్యంగా ఔలియా, సజ్జనులు, ఆరిఫులు, సూఫియుల గురించి ఎటువంటి రివాయతులు ఉన్నాయంటే– వాటిని అర్ధం చేసుకోవడం అసాధ్యం మరియు ప్రజలూ అంగీకరించరు. కాని ఇందు వల్ల సున్నీయుల పై లఅనత్ చేయాలి అని అర్ధం కాదు కదా!.

రజ్అత్ ఖుర్ఆన్ మరియు సున్నత్ ప్రకారంగా నిరూపితమైనది. రజ్అత్ అల్లాహ్‌కు అసాధ్యం కాదు. ఖుర్ఆన్ యొక్క కొన్ని ఉదాహారణాలు తిలకించండి:
1. ఆయత్: 
أَوۡ كَٱلَّذِي مَرَّ عَلَىٰ قَرۡيَةٖ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحۡيِۦ هَٰذِهِ ٱللَّهُ بَعۡدَ مَوۡتِهَاۖ فَأَمَاتَهُ ٱللَّهُ مِاْئَةَ عَامٖ ثُمَّ بَعَثَهُ
అనువాదం: లేక ఉదాహారణకు – ఇళ్ళ కప్పులు తల క్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా ప్రయాణం చేసిన వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా పలికాడు: ‎“‎శిథిలయమైపోయిన ఈ పట్టణానికి అల్లాహ్ మళ్ళీ ఏవిధంగా జీవం పోస్తాడు” అప్పుడు అల్లాహ్ అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతడు నూరేళ్ళ వరకు ఉన్నాడు. తరువాత అల్లాహ్ అతనిని మళ్ళి బ్రతికించాడు[అల్ బఖరా సూరా:2, ఆయత్:259]

2. ఆయత్:
أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ خَرَجُواْ مِن دِيَٰرِهِمۡ وَهُمۡ أُلُوفٌ حَذَرَ ٱلۡمَوۡتِ فَقَالَ لَهُمُ ٱللَّهُ مُوتُواْ ثُمَّ أَحۡيَٰهُمۡ
అనువాదం: మరణభీతితో తన ఇళ్ళూవాకిళ్ళను విడిచి వెళ్ళిన వారి ఉదంతాన్ని గురించి నీవు తలపోశావా? వారు వేల సంఖ్యలో ఉండేవారు. అల్లాహ్ వారితో “చావండి” అని అన్నాడు. మళ్ళీ ఆయన వారిని బ్రతికించాడు[అల్ బఖరా సూరా:2, ఆయత్:243]

3. ఆయత్:
وَإِذۡ قُلۡتُمۡ يَٰمُوسَىٰ لَن نُّؤۡمِنَ لَكَ حَتَّىٰ نَرَى ٱللَّهَ جَهۡرَةٗ فَأَخَذَتۡكُمُ ٱلصَّٰعِقَةُ وَأَنتُمۡ تَنظُرُونَ ثُمَّ بَعَثۡنَٰكُم مِّنۢ بَعۡدِ مَوۡتِكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ
అనువాదం: మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి: “మూసా! అల్లాహ్‌ను కళ్ళారా చూడనంత వరకు, నీ మాటలను ఎంత మాత్రం విశ్వసించము” అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే, ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్జీవులై నేలకొరిగారు. మళ్ళి మేము ప్రాణంపోసి మిమ్మల్ని లేపాము, కనీసం ఈ ఉపకారం తరువాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని[అల్ బఖరా సూరా:2, ఆయత్:55, 56]
ఇందులో పూర్తి ఒక వర్గం పునర్జీవనం ప్రస్తావన ఉంది.

4. ఆయత్:
ثُمَّ بَعَثۡنَٰهُمۡ لِنَعۡلَمَ أَيُّ ٱلۡحِزۡبَيۡنِ أَحۡصَىٰ لِمَا لَبِثُوٓاْ أَمَدٗا
అనువాదం: ఆ తరువాత మేము వారిని మేల్కోలిపాము, ఆ రెండు వర్గాలలో ఏ వర్గం వారు తాము గుహలో ఉన్న కాలాన్ని కచ్చితంగా లెక్కకడతారో పరీక్షిద్దామని[కహఫ్ సూరా:18, ఆయత్:12]
ఈ ఆయత్‌లో “అస్హాబె కహఫ్‌”కు పునర్జీవితం ప్రసాదించబడిన ప్రస్తావన ఉంది, వీళ్ళు ఒక గుహలో మూడు వందల సంవత్సరముల కన్న ఎక్కువ మృతులుగా పడి ఉన్నారు.
ఖుర్ఆన్‌లో పూర్వ ఉమ్మతులలో “రజ్అత్” సంభవించిన ప్రస్తావన ఉంది. అందుకని ఈ రజ్అత్ ఉమ్మతే ముహమ్మదీ(స.అ)లో(సంభవించడం) అసాధ్యం కాదు మరియు కాకూడదు. ముఖ్యంగా దాని గురించి ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లు రివాయత్ కూడా చేశారు. ఇక అసాధ్యం అయ్యే సమస్యే లేదు. ఎందుకంటే వీళ్ళు సత్యులు మరియు జ్ఞానులు కాబట్టి.

రిఫరెన్స్
హంరాహ్ బా రాస్తగోయాన్, తీజానీ సమావీ, పేజీ430.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19