అల్ జామిఅ గ్రంథం-2

బుధ, 12/22/2021 - 14:05

దైవప్రవక్త(స.అ) తమ ఉల్లేఖనలను లిఖించమని ఆదేశించేవారు మరియు వారి హదీసులను లిఖించేవారు అని నిదర్శించడానికి కొన్ని హదీసులతో పాటు అల్ జామిఅహ్ గ్రంథం కూడా ఒక ముఖ్యమైన నిదర్శనం...

అల్ జామిఅ గ్రంథం-2

“బుఖారీ” “కితాబతుల్ ఇల్మ్” అధ్యాయంలో “షఅబీ” ద్వార, అతను ‘జహీఫహ్’ ద్వార రివాయత్
ను ఉల్లేఖించారు, నేను అలీ(అ.స)తో ఇలా అడిగాను: మీ వద్ద (వేరే) పుస్తకం ఏదైనా ఉందా? అప్పుడు వారు, లేదు! అల్లాహ్ గ్రంథం, మరియు ఒక ముస్లిముకు ప్రసాదించబడే బుద్ధి మరియు ఈ గ్రంథం తప్ప అని సమాధానమిచ్చారు.
నేను ఆ గ్రంథంలో ఏముంది అని అడిగాను?
అతను ఇలా అన్నారు: అందులో వివేకం, బంధీల విముక్తి, మరియు కాఫిర్
కు బదులుగా ముస్లిము చంపబడడు, (అన్న అంశాలు) వ్రాసి ఉన్నాయి.[1]

“బుఖారీ”లోనే వేరే చోట “అఅమష్ ఇబ్రాహీమ్ తమీమి” మరియు ఇబ్రాహీమ్ యొక్క తండ్రి ద్వార రివాయత్ ఉల్లేఖించబడింది, అలీ(అ.స) ఇలా ప్రవచించారు: మా వద్ద అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) హదీసులు లిఖించబడి ఉన్న ఈ “సహీఫా గ్రంథం” తప్ప ఏది లేదు.[2]
ఇంకో అధ్యాయంలో “బుఖారీ” “ఇబ్రాహీమె తమీమి” మరియు అతని తండ్రి ద్వార ఉల్లేఖించారు, అతను ఇలా అన్నారు: అలీ(రజియల్లాహు అన్హూ) మా మధ్య ఇటుకలతో కట్టి ఉన్న పీఠం నుండి ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అతని వద్ద ఒక ఖడ్గం ఉంది దానికి ఒక గ్రంథం వేలడుతుంది. అతను ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా మా వద్ద అల్లాహ్ గ్రంథం మరియు ఈ “సహీఫా గ్రంథం” తప్ప చదివేందుకు వేరే ఏ ఒక్క గ్రంథం లేదు.[3]
“బుఖారీ” “అల్ జామిఅహ్” అను గ్రంథం గురించి ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స) యొక్క వచనం “అందులో అన్నీ హలాల్, హరామ్ మరియు మానవులకు అవసరమైన ప్రతీది, చివరికి చిన్న గీరుట గురించి కూడ అందులో వ్రాసి ఉంది. ఇది దైవప్రవక్త(స.అ) చెప్పారు మరియు అలీ(అ.స)యే స్వయంగా దానిని తన చేతులతో వ్రాశారు” ఉల్లేఖించలేదు.
“బుఖారీ” దానికి ఒకసారి ఇలా సంక్షిప్తంగా, ఇందులో బుద్ధి(కి సంబంధించిన మాటలు) బందీకి విముక్తి, కాఫిర్
కు బదులుగా ముస్లిం చంపబడడు అనీ. మరో చోట దీనిని అలీ(అ.స) చూపించారు అందులో ఒంటే వయసు, మదీనా పవిత్ర ప్రదేశమని..., అనీ. మరి అందులో ముస్లిముల బాధ్యతల గురించి మరియు తమ సమూహ పెద్దల అనుమతి లేకుండా వేరే సమూహంతో ఒప్పందం గురించి.., ఉంది అని చెప్పారు.
దీనినే యదార్ధాన్ని కప్పిపెట్టడం అని అంటారు. లేకపోతే ఈ మాట నమ్మదగినదా! అలీ(అ.స) ఒక గ్రంథంలో నాలుగు వాక్యలు వ్రాసుకొని దానిని ఖడ్గానికి వేలాడదీసి ఎక్కడ ఉపన్యాసమివ్వాలన్నా దాని నుండే ఇవ్వడం, మరియు అల్లాహ్ గ్రంథం తరువాత రెండవ మూల పుస్తకం, అని అనడం. మరి దాని గురించి ఇలా ప్రవచించడం: “మేము దైవప్రవక్త(స.అ) నుండి ఖుర్ఆన్ మరియు ఈ గ్రంథం తప్ప మరేది వ్రాయలేదు”.

“అబూ హురైరహ్” యొక్క బుద్ధి హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క బుద్ధికి మించిందా? అబూ హురైరహ్
కు వ్రాయకుండానే దైవప్రవక్త(స.అ) యొక్క లక్ష హదీసులు గుర్తున్నాయి!
అల్లాహ్ సాక్షిగా వీళ్ళ సమస్యే ఆశ్చర్యకరమైనది. వీళ్ళు, దైవప్రవక్త(స.అ)తో కేవలం మూడు సంవత్సరములు కలిసి ఉన్న మరియు చదవడం, వ్రాయడం కూడా రాని అజ్ఞాని అయిన అబూహురైరహ్ నుండి ఉల్లేఖించబడినటువంటి లక్ష హదీసులను స్వీకరిస్తారు. అలీ(అ.స)ని విజ్ఞానం ఉప్పొంగే నది, సహాబీయులకు జ్ఞానం నేర్పించువారుగా భావిస్తారు, అలాంటి వ్యక్తిని ఒక గ్రంథం పట్టుకున్న వారిలా మరి అందులో నాలుగు హదీసులు ఉన్నట్లుగా చూపిస్తారు. దైవప్రవక్త(స.అ) కాలం నుండి తన ఖిలాఫత్ కాలం వరకు దానిని ఎత్తుకొని తిరిగే వారని, ఒకవేళ పీఠం ఎక్కితే అది ఖడ్గానికి వేలాడి ఒక గ్రంథం కూడా ఉండేది, ఇవన్నీ అసత్యాలు మరియు నిందలు.
“బుఖారీ” వ్రాసిన ఈ విషయాలే ఒక పరిశోధకుడికి మరియు వివేకుడికి చాలనుకోండీ!. “బుఖారీ” అందులో బుద్ధికి సంబంధించిన మాటలు ఉన్నాయి అని వ్రాశారు. ఈ మాటే అందులో ఉన్న విషయాలు మానవ బుద్ధి మరియు ఇస్లామీయ అభిప్రాయాలతో ప్రత్యేకించబడిన విషయాలు, ఉన్నాయి అనడానికి సాక్ష్యం.
ఆ గ్రంథంలో ఏమి వ్రాసి ఉంది అన్న విషయం పై సాక్ష్యాన్ని ప్రదర్శించాలని అనుకోవడం లేదు. మక్కా వాసులకు దాని భాగాలు మరియు అధ్యాయాల గురించి బాగా తెలిసే ఉండి ఉంటుంది. మరియు ఇంటి సభ్యులకే ఇంటి విషయాల బాగా తెలుస్తాయి. అహ్లెబైత్(అ.స)లే “ఇందులో మానవులకు అవసరమైనటువంటి ప్రతీ విషయం గురించి ఉంది, అది హలాల్ కానివ్వండి లేదా హరామ్ చివరికి అందులో చిన్న గీరుట[4] గురించి కూడా అందులో వ్రాసి ఉంది” అని ప్రవచించారు.

ఈ సంభాషణలో మాకు ముఖ్యమైనదేమిటంటే, సహాబీయులు దైవప్రవక్త(స.అ) హదీసులను వ్రాసేవారు. అబూ హురైరహ్ యొక్క ఈ వచనం “అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ దైవప్రవక్త(స.అ) హదీసులను వ్రాసేవారు” మరియు ఇమామ్ అలీ(అ.స) యొక్క ఈ వచనం “మేము దైవప్రవక్త(స.అ) నుండి కేవలం ఖుర్ఆన్ మరియు ఈ సహీఫా గ్రంథాన్ని వ్రాశాము”, ఈ రెండు వచనాలు దైవప్రవక్త(స.అ) తన హదీసుల లేఖనాన్ని ఎన్నడూ నిషేదించలేదు, అన్న విషయం పై గట్టి సాక్ష్యాలు. అంతేకాదు దానికి వ్యతిరేకించడం సరికాదు. మరియు “ముస్లిం” తన పుస్తకం “సహీ”లో “ఖుర్ఆన్ తప్ప నేను చెప్పే వేరే ఏదీ వ్రాయవద్దు మరియు ఒకవేళ ఎవరైన వ్రాస్తే వాటిని చెరిపేయండి” అని ఉల్లేఖించిన ఆ హదీస్ అసత్యమైనది. దీనితో ఖులఫాలను సహకరించారు. మరియు వాళ్ళు చేసిన పని సరైనది, అని సమ్మతిచారు. అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్
లను, వారు హదీసులను తగలబెట్టిన మరియు దానిని ప్రవచించడానికి నిలిపివేసిన వాటి నుండి బయట పడేశారు.
దైవప్రవక్త(స.అ) తన హదీసులను వ్రాయకుండా ఆపలేదు. అంతేకాదు వాటిని వ్రాయమని ఆదేశించారు అన్న మా విశ్వాసాన్ని ఇంకా బలపరిచింది దైవప్రవక్త (స.అ)కు అతి దగ్గర వ్యక్తి అయిన హజ్రత్ అలీ(అ.స) యొక్క ఈ వచనం “మేము దైవప్రవక్త(స.అ) నుండి ఖుర్ఆన్ మరియు సహీఫా గ్రంథం తప్ప ఏదీ వ్రాయ లేదు”, మరి దీనిని బుఖారీ కూడా నమ్మారు.
మరియు మేము దీనితో పాటు ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స) ప్రవచనం “సహీఫయే జామిఅహ్, దైవప్రవక్త(స.అ) ప్రవచనాలు, వాటిని అలీ(అ.స)యే స్వయంగా తమ చేతితో వ్రాశారు”తో జోడిస్తే “దైవప్రవక్త(స.అ) అలీ(అ.స)కు (హదీసులు) వ్రాయమని ఆదేశాన్ని ఇచ్చారు” అని అర్ధమౌతుంది.

రిఫరెన్స్
1. సహీబుఖారీ, భాగం1, పేజీ36.
2. సహీబుఖారీ, భాగం2, పేజీ221. సహీబుఖారీ, భాగం, భాగం4, పేజీ115.
3. సహీబుఖారీ, భాగం8, పేజీ144.
4. ఏదైన వస్తువును పాడు చేయడం లేదా దాని పై గీరుట వల్ల చెల్లాల్సి వచ్చే జరిమానా.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20