ఇమామ్ కోసం త్యాగం

ఆది, 01/09/2022 - 12:05

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన భర్త మరియు ఇమామ్ పట్ల ఎలా బాధ్యతగా ఉన్నారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఇమామ్ కోసం త్యాగం

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన భర్త మరియు ఇమామ్ పట్ల త్యాగభావాన్ని చూపించడంలో తీవ్రత కలిగివుండేవారు. శత్రువులు ఇంటిని వచ్చి హజ్రత్ అలీ(అ.స)ను ఇంటి నుంచి బయటకు రమ్మని కోరినప్పుడు వారిపై దాడి చేయకుండా అడ్డుకోవడానికి ఆమె తలుపు వెనక వచ్చి నిలబడ్డారు. ఆ సమయంలోనే ఆమె మరియు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ ఇమామ్ కోసం త్యాగమయ్యారు.

ఇప్పుడు కొన్ని రివాయతులు చూద్దాం:
ఇంటిని కాల్చడానికి వచ్చినప్పుడు హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఇలా అన్నారు: ఓ మార్గభ్రష్టులారా, ఓ అబద్ధాలకోరులారా! ఏంమాట్లాడుతున్నారు, మీకేంకావాలి.[1]
హజ్రత్ అలీ(అ.స)ను మస్జిద్ వైరు తీసుకెళ్తున్నప్పుడు ఆమె ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా, నా భర్తను అన్యాయంగా మస్జిద్ వైపుకు లాక్కుంటూ తీసుకొని వెళ్లనివ్వను.[2]
హజ్రత్ అలీ(అ.స)ను బలవంతంగా మస్జిద్ వైపు లాక్కొని వెళ్తుండగా హజ్రత్ జహ్రా(స.అ) ఇలా అన్నారు: నా పినతండ్రి కుమారుడు(హజ్రత్ అలీ)ను వదిలిపెట్టండి.[3]
కత్తి చూపించి బలవంతంగా హజ్రత్ అలీ(అ.స) నుంచి బైఅత్ తీసుకోవాలనుకున్నప్పుడు, అబూబక్ర్ ను ఉద్దేశించి ఇలా అన్నారు: “ఓ అబూబక్ర్! నువ్వు నన్ను విధవరాలు చేయాలనుకుంటున్నావా? నువ్వు ఆయన్ని వదలకపోతే నేను నా తల వెంట్రుకలను విప్పుకొని, శోఖ స్థితిలో నా తండ్రి; దైవప్రవక్త(స.అ) సమాధి వద్దకు వెళ్తాను.[4]
వాళ్లు హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) మాటలు వినకపోడంతో ఆమె సల్మాన్ వైపు చూసి ఇలా అన్నారు: “ఓ సల్మాన్! వాళ్లు అలీ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. వారి మరణం నాకు సహించదగనిది, నన్ను నా తల వెంట్రుకలను విప్పుకొని, శోఖ స్థితిలో నా తండ్రి సమాధి వద్దకు వెళ్లని, అల్లాహ్ సన్నిధిలో వేడుకుంటాను.[5]
అలాగే మరో చోట ఇలా ఉంది: ఓ సల్మాన్! వాళ్లు నా ఇద్దరు పిల్లలు హసన్ మరియు హుసైన్(అ.స) ను అనాధులు చేయాలనుకుంటున్నారు. అల్లాహ్ సాక్షిగా ఓ సల్మాన్! నా కళ్లతో నా పినతండ్రి కుమారుడు(హజ్రత్ అలీ)ను సురక్షితంగా చూడనంత వరకు మస్జిద్ ద్వారం నుంచి బయట కాలు పెట్టను.[6].
కొంత సమయం గడిచిన తరువాత శత్రువులు ఇమామ్ ను వదిలేశారు, వారు ఒంటరిగా మస్జిద్ బయటకు వచ్చారు. ఇంటి మార్గం పట్టారు, హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన భర్తను చూసి ఇలా అన్నారు: “నా ప్రాణాలు నీ ప్రాణాలపై ఫిదా, నా ఆత్మ నీపై పడే కష్టాలకు కవచం. ఓ అబుల్ హసన్! నిత్యం నీతో ఉంటాను, నువ్వు కష్టాల్లో ఉన్నా నేను నీతోడుంటాను.[7]

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఒకవైపు మంచి కూతురు, భార్య మరియు తల్లీ యే కాకుండా తన నాయకుడు మరియు ఇమామ్ అయిన హజ్రత్ అలీ(స.అ) రక్షణ కోసం పడిన కష్టాలు మరియు చేసిన త్యాగాలు మనందరికీ మంచి పాఠాలు. అల్లాహ్ మనందరిలో మన ఇమామ్ పట్ల విధేయత మరియు త్యాగభావాన్ని పెంచుగాక!

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం30, పేజీ293.
2. బైతుల్ అహ్జాన్, షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, పేజీ117.
3. బిహారుల్ అన్వార్, భాగం28, పేజీ206.
4. తఫ్సీరె అయాషీ, భాగం2, పేజీ67.
5. బిహారుల్ అన్వార్, భాగం28, పేజీ228.
6. అవాలిముల్ ఉలూమ్, భాగం11, పేజీ406.
7. కౌకబుద్దుర్రీ, హాయెరీ మాజిందరానీ, భాగం1, పేజీ196.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15