కర్బలా హదీసులనుసారం

శుక్ర, 09/09/2022 - 14:18

కర్బలా ప్రతిష్టత ను వెళ్లడించే చాలా హదీసులు ఉన్నాయి వాటి నుండి కొన్ని హదీసుల వివరణ...

కర్బలా హదీసులనుసారం

కర్బలా ప్రతిష్టత ను వెళ్లడించే చాలా హదీసులు ఉన్నాయి వాటి నుండి కొన్ని హదీసుల తెలుగు అనువాదం మీ కోసం..

1. కర్బలా ప్రతిష్టత

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: భూమండలం పై అతి పవిత్రమైన మరియు అత్యుత్తమ సమాధి(గోపురం), కర్బలా. నిస్సందేహంగా కర్బలా స్వర్గానికి చెందినది.[1]

2. విముక్తి నేల

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నా కుమారుడు హుసైన్ ను సమాధి చేయబడే భూమి, కర్బలా భూమి..... అల్లాహ్ హజ్రత్ నూహ్ మరియు వారి సహచరులను అక్కడే తుఫాన్ నుండి విముక్తిని ప్రసాదించాడు.[2]

3. కర్బలా సుగంధం

హజ్రత్ అలీ(అ.స) కర్బలా భూమిని ఉద్దేశించి ఇలా అన్నారు: ఓ మన్ను, ఎమి సుగంధం! ప్రళయదినాన నీ నుండి లేచే సమూహం లెక్క లేకుండా మరియు నిస్సందేహంగా స్వర్గంలో ప్రవేశిస్తారు.[3]

4. ఫురాత్ మరియు కర్బలా

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: కర్బలా భూమి మరియు ఫురాత్ నీళు, అల్లాహ్ ప్రతిష్టత ప్రసాదించిన మొట్టమొదటి నేల మరియు మొట్టమొదటి నీళ్లు.[4]

5. స్వర్గమార్గం

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సమాధి స్థలం స్వర్గపు ద్వారాల నుండి ఒక ద్వారం.[5]

6. కర్బలా, అల్లాహ్ హరమ్

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: నిస్సందేహంగా అల్లాహ్ మక్కాను తన హరమ్ గా నిర్ధారించక ముందే కర్బలాను సురక్షిత మరియు పుణ్య ప్రదేశంగా నిర్దారించెను.[6]

7. నిత్య దర్శనం

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: కర్బలాను దర్శించుకోండి, ఈ పనిని చేస్తూనే ఉండండి, ఎందుకంటే కర్బలా భూమి దైవప్రవక్త(అ.స) కుమారులను తన ఒడిలో పెట్టుకొని ఉంది.[7]

8. దర్శన మక్కువ

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: ఒకవేళ ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సమాధి దర్శనం లో ఉన్న ప్రతిష్టత, ప్రజలకు తెలిసుంటే; దర్శనం పట్ల మక్కువతోనే (అంతిమ) శ్వాస విడిచేవారు.[8]

9. సమ్మతమైన మరియు ఉత్తమ హజ్

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: .... ఇమామ్ హుసైన్(అ.స) సమాధి దర్శనం దైవప్రవక్త(స.అ)తో కలిసి చేసిన హజ్జె మఖ్బూల్ తో సమానం.[9]

10. ఉత్తమ చర్య

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సమాధి దర్శనం చేసే చర్యలలో ఉత్తమ చర్య అని చెప్పవచ్చు.[10]

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ115; కామిల్ అల్ జియారాత్, పేజీ264.

2. కామిల్ అల్ జియారాత్, పేజీ269, బాబ్88, హదీస్8.

3. షర్హె నెహ్జుల్ బలాగహ్, ఇబ్నె అబిల్ హదీద్, భాగం4, పేజీ169.

4. బిహారుల్ అన్వార్, భాగం98, పేజీ109., కామిల్ అల్ జియారాత్, పేజీ269.

5. కామిల్ అల్ జియారాత్, పేజీ271, బాబే89, హదీస్1.

6. కామిల్ అల్ జియారాత్, పేజీ267, బాబ్98, హదీస్110.

7. కామిల్ అల్ జియారాత్, పేజీ269.

8. సవాబుల్ ఆమాల్, పేజీ319; కామిల్ అల్ జియారాత్.

9. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం1, పేజీ266; కామిల్ అల్ జియారాత్, పేజీ156.

10. ముస్తద్రికుల్ వసాయల్, భాగం10, పేజీ311.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17