ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స)

శని, 02/25/2023 - 17:37

ప్రజల సన్మార్గం కోసం అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడ్డ దైవప్రవక్త(స.అ) నాలుగొవ ఉత్తరాధికారీ, దైవారాధకుల అలంకణా, కర్బలా వీరుల లక్ష్యం అంతం కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నం చేసినవారూ, అతి దుర్మార్గుల సభలో కూడా కర్బలా లక్ష్యాన్ని వివరిస్తూ ఉపన్యాసం ఇచ్చిన మహావీరుడూ, ఇస్లాం రక్షణ కోసం ఎటువంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకొనిపోయేవారూ, కత్తుల ప్రమేయం లేకుండా కేవలం దుఆలతో శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసినవారూ, తరువాతి కాలంలో ఇస్లామీయ విశ్వవిధ్యాలయాలు స్థాపించే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దిన మాహా మూర్తి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు.

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స)

ప్రజల సన్మార్గం కోసం అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడ్డ దైవప్రవక్త(స.అ) నాలుగొవ ఉత్తరాధికారీ, దైవారాధకుల అలంకణా, కర్బలా వీరుల లక్ష్యం అంతం కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నం చేసినవారూ, అతి దుర్మార్గుల సభలో కూడా కర్బలా లక్ష్యాన్ని వివరిస్తూ ఉపన్యాసం ఇచ్చిన మహావీరుడూ, ఇస్లాం రక్షణ కోసం ఎటువంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకొనిపోయేవారూ, కత్తుల ప్రమేయం లేకుండా కేవలం దుఆలతో శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసినవారూ, తరువాతి కాలంలో ఇస్లామీయ విశ్వవిధ్యాలయాలు స్థాపించే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దిన మాహా మూర్తి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు.

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) కర్బలా యుద్ధం సమయంలో కర్బలాలోనే ఉన్నారు, కాని అనారోగ్యం వల్ల యుద్ధం చేయలేకపోయారు. ఇమామ్ హుసైన్(అ.స) మరణాంతరం వారిని గొలుసులతో బంధించి దయాదాక్షిణ్యాలు లేకుండా కొరడాలతో కొడుతూ కర్బలా నుండి కూఫాకు మరియు అక్కడ నుండి షామ్ పట్టణానికి తీసుకొని వెళ్ళారు. షామ్ చేరిన తరువాత యజీద్ రాజ్యసభలో ముఖ్యమైన, సుధీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు దానితో షామ్ ప్రజలకు కర్బలా యుద్ధం యొక్క యదార్థం తెలిసింది. చివరికి యజీద్ కు వారిని విడుదల చేయవలసి వచ్చింది.
ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) హిజ్రీ యొక్క 37వ సంవత్సరం, షాబాన్ మాసం 4వ తారీఖున మదీనహ్ లో జన్మించారు. కర్బలా యుద్ధం సమాయంలో అతని వయసు 24 సంవత్సరాలు. వారి తండ్రి ఇమామ్ హుసైన్(అ.స) మరణాంతరం 35 సంవత్సరాలు ఇమామత్ బాత్యను నిర్వర్తించి చివరికి దుర్మార్గుల విషప్రయోగం ద్వార మరణించారు.[1]

ఇమామ్ బోధన
ఒక వ్యక్తి ఇమామ్ జైనుల్ ఆబిదీన్(అ.స) వద్దకు వచ్చి తన జీవిత పరిస్థితి గురించి పిర్యాదు చేశాడు. అప్పుడు ఇమామ్(అ.స) ఈ విధంగా సెలవిచ్చారు: ఆదం సంతానం ప్రతీ రోజూ మూడు రకాల కష్టాలో చిక్కుకుంటాడు కానీ అతడు వాటి నుండి ఎటువంటి పాఠాన్ని నేర్చుకోడు. ఒక వేళ పాఠాన్ని నేర్చుకున్నట్లైతే అతని కష్టాలు తొలిగిపోతాయి. మొదటి కష్టమేమిటంటే ప్రతీ రోజు అతని ఆయువు తగ్గుతుంది, ఒక వేళ అతనికి ఆస్తి పరంగా ఏమైనా నష్టం కలిగితే ఆ ఆస్తిని తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఆయష్షును తిరిగి పొందలేము.

రెండవది: ప్రతీ రోజు తన జీవినాధారాన్ని తింటున్నాడు, ఒక వేళ అది హలాల్(న్యాయబద్దమైనది) అయి ఉంటే దాని గురించి లెక్క చెప్పాలి మరియు ఒక వేళ హరాం ద్వారా (అధర్మంగా) పొందినదైతే దాని శిక్షను అనుభవించక తప్పదు.

మూడవది.. చాలా ముఖ్యమైనది అని అన్నారు. అది ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు, దానికి ఇమామ్(అ.స) ప్రతీ దినం ఎప్పుడైతే ఆ దినం ముగుస్తుందో అతను ప్రళయదినానికి ఒక అడుకు దగ్గరవుతున్నాడు, కానీ అతనికి స్వర్గం వైపుకు వెళ్తాడో నరకానికి వెళ్తాడో తెలియదు. ఆ తరువాత ఈ విధంగా పలికారు: మానవుని జీవితపు అతి పొడుగైన రోజు అతను తన తల్లి కడుపు నుండి బయటకు వచ్చిన రోజు.
ఇమాం జైనుల్ ఆబిదీన్(అ.స) లా వారి కన్నా ముందు ఎవ్వరూ ఈ విధంగా చెప్పలేదని జ్ఞానులు అన్నారు.[2]

ఇమామ్ యొక్క ఆరాధన
ఎలగైతే ఆ మహాప్రవక్త(స.అ) దైవారాధనకు మరియు ప్రార్ధనలకు విలువనిచ్చేవారో అదే విధంగా ఆయన ఉత్తరాధికారులు కూడా దానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు, కానీ కొందరిలో ఈ లక్షణం ఎక్కువగానే చూడటం జరిగింది వారిలో నుండి ఇమామ్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స) ఒకరు, ఇమామ్(అ.స) ప్రార్ధనకు ఇచ్చే ప్రాముఖ్యతను మరియు వారు దానికి కేటాయించే సమయాన్ని చూసిన వారు ఆయనను “జైనుల్ ఆబిదీన్” అని పిలవసాగారు, అంతేకాకుండా ఆ దేవునికి చేసే సుదీర్ఘ సజ్దాలు వారిని సయ్యదుస్ సాజిదీన్ అనే బిరుదును తెచ్చిపెట్టాయి.
ఇమామ్(అ.స) అనుచరులలో ఒకరైన తాఊస్ ఇబ్నె కైసానె యమాని వారి గురించి ఈ విధంగా చెప్పారు: "నేను ఇమామ్(అ.స) ను హజరె ఇస్మాఈల్(కాబా వద్ద గల ఒక పవిత్రమైన చోటు) వద్ద చూశాను వారు ఆ అల్లాహ్ ప్రార్ధనలో నిమగ్నమై ఉన్నారు, ఎప్పుడైతే వారు నమాజు నిమిత్తం నిలబడ్డారో కొన్ని సార్లు వారి ముఖం పసుపు రంగులోకి మారటాన్ని మరి కొన్ని సార్లు నీల రంగులో మారటాన్ని నేను గమనించాను, వారి శరీరంలో అల్లాహ్ పట్ల భయాన్ని చూశాను, వారు ఆ నమాజును తన జీవితపు ఆఖరి నమాజు వలె చేసారు, ఎప్పుడైతే సజ్దాలోకి వెళ్ళారో చాల సమయాన్ని సజ్దాలోనే గడిపారు, ఎప్పుడైతే సజ్దా నుండి తలను ఎత్తారో వారి దేహం మొత్తం చేమటతో తడిచిపోయు ఉంది".
మరెన్నో హదీసులలో వారి యొక్క ప్రార్ధనా విధానాన్ని మరియు అల్లాహ్ పట్ల భక్తిలో వారి యొక్క స్థితిని వివరించడం జరిగింది, ఇమామ్(అ.స) ప్రార్ధనలకు ఇచ్చే ప్రాముఖ్యత వారి శత్రువులను సైతం ఆస్చర్యానికి గురి చేసింది, కర్బలా గాధలో కూడా కష్టాలను సైతం లెక్కజేయకుండా వారు ఈ నమాజుకు మరియు ప్రార్ధనలకు ఇచ్చిన ప్రాముఖ్యత చూసినట్లైతే వారు నిజంగానే సయ్యిదుస్ సాజిదీన్ మరియు జైనుల్ ఆబిదీన్ అని అంగీకరించక తప్పదు.[3]

రిఫరెన్స్
1. జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, పేజీ216, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగ78, పేజీ160.
3. సైరొ ఆలమిన్ నుబలా, భాగం4, పేజీ393, 394.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18