రమజాన్ మాసం గురించి దైవప్రవక్త(స.అ) తన సహాబీయుల మధ్య ఇచ్చిన ఉపన్యాసాల మరియు హదీసుల నుండి ముఖ్యాంశాలు...

రమజాన్ మాసం గురించి దైవప్రవక్త(స.అ) తన అహ్లె బైత్(స.అ) మరియు సహాబీయుల మధ్య ఇచ్చిన ఉపన్యాసాల మరియు హదీసుల నుండి ముఖ్యాంశాలు:
ఓ ప్రజలారా! అల్లాహ్ యొక్క మాసం తన కారుణ్యం, శుభం మరియు క్షమాపణాలతో పాటు మీ వైపుకు వస్తుంది. ఈ నెల అల్లాహ్ దృష్టిలో ఇతర నెలల కన్నా ప్రతిష్టాత్మకమైనది. ఈ నెల యొక్క దినాలు ఇతర దినాలకు మించినవి, దాని రాత్రుళ్లు ఇతర రాత్రుళ్ల కన్నా ఉత్తమమైనవి, దాని గడియాలు ఇతర గడియాల కన్నా గొప్పవి, ఈ నెలలో మీరు అల్లాహ్ యొక్క ఆతిథ్యానికి ఆహ్వానించబడుతున్నారు. ఈ మాసంలో నువ్వు అల్లాహ్ కారుణ్యాన్యానికి అర్హుడిగా నిర్దారించబడతావు.
అందులో(రమజాన్ మాసంలో) మీ ఉపిరి పీల్చడం తస్బీహ్, మీ నిద్ర ఆరాధన, మీ అమలు సమ్మతించబడినది మరియు మీ దుఆ స్వీకరించబడినది. అయితే మీరు స్వచ్ఛమైన నియత్తుతో మరియు పవిత్ర హృదయాలతో అల్లాహ్ ను ఉపవాస దీక్షలను నిర్వర్తించే మరియు అందులో ఖుర్ఆన్ పారాయణం చేసే అర్హతను ప్రసాదించాలని వేడుకోండి, ఎందుకంటే ఈ నెలలో అల్లాహ్ క్షమాపణ పొందని వాడు అభాగ్యుడు కాబట్టి.
ఓ ప్రజలారా! ఈ నెలలో స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. అందుకని అల్లాహ్ ను అవి మీ వైపు మూసుకోకూడదని వేడుకోండి. ఈ నెలలో నరకం యొక్క ద్వారాలు మూసేయబడ్డయి, అల్లాహ్ ను వాటిని మీ కోసం తెరవబడకూడదని వేడుకోండి. షైతానులు బంధించబడాయి అయితే అవి మరలా తిరిగి మీ పై ఆధిపత్యాన్ని పొందకూడదని వేడుకోండి.
ఓ ప్రజలారా! మీలో ఎవరైనా ఏ ఒక్క విశ్వాసికైనా ఇఫ్తారు తినిపిస్తే అతడికి ఒక బానిసను విడిపించిన పుణ్యం మరియు పూర్వం చేసుకున్న పాపములన్నింటికి అల్లాహ్ తరుపు నుంచి క్షమాబిక్ష లభిస్తుంది. అప్పుడు ప్రశ్నించబడింది ఓ దైవప్రవక్త(స.అ) ఒకవేళ మాకు ఒకరికి ఇఫ్తార్ తినిపించే స్థోమత లేకపోతే?. దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: నరకాగ్ని నుండి విముక్తి పొందండి, అది అర్ధ ఖర్జురం ద్వార అయినా ఇఫ్తార్ చేయించండి.
అల్లాహ్ కు భయపడండి, ఒక గుక్కెడు నీళ్లతో అయినా ఇఫ్తార్ చేయించండి. అల్లాహ్ తఆలా అతడు దానికి మించి అమలు చేసే స్థోమత లేక చేసిన ఆ చిన్న పనిని పుణ్యన్ని ప్రసాదిస్తాడు. ఓ ప్రజలారా! ఎవరైతే ఈ నెలలో మంచి ప్రవర్తన కలిగివుంటారో ప్రళయదినాన సిరాత్ పుల్(సిరాత్ వంతెన) పై ప్రజల కాళ్లు తడబడుతున్నప్పుడు అతడు చాలా సులువుగా దాని పైనుండి (నడుచుకుంటూ) వెళ్లిపోతాడు. ఎవరైతే ఈ నెలలో తన దాసుల ద్వారా తక్కువ పని చేయిస్తారో అల్లాహ్ ప్రళయదినాన అతడి నుండి లెక్కను చాలా సులభంగా తీసుకుంటాడు. ఎవరైతే ఈ నెలలో ప్రజలను తన చెడు నుండి కాపాడుతాడో, అల్లాహ్ ప్రళయదినాన తన ఆగ్రహం నుండి కాపాడతాడు. ఎవరైతే ఈ నెలలో అనాధుల పై దయ చూపుతారో అల్లాహ్ ప్రళయదినాన అతడిపై దయ చూపుతాడు. ఎవరైతే ఈ నెలలో తమ బంధువుల పట్ల మంచిని తెంచుకుంటే అల్లాహ్ ప్రళయదినాన తన కారుణ్యాన్ని కత్తిరిస్తాడు. ఎవరైతే ఈ నెలలో ఒక్క ఆయత్ ను పఠిస్తారో దాని పుణ్యం ఇతర నెలలలో పూర్తి ఖుర్ఆన్ ను పఠించిన మాదిరి.
కొందురు ఉపవాసం అంటే కేవలం అన్నపానియాలకు దూరంగా ఉండడం అని భావిస్తారు. ఇలాంటి వారు ఇమామ్ అలీ(అ.స) యొక్క ఈ ఉల్లేఖనం యొక్క చిత్రం, ఇమామ్(అ.స) ఇలా ప్రవచించారు: “ఉపవాసం ఉండేవారిలో చాలా మందికి తన ఉపవాసం ద్వార కేవలం దప్పిక తప్ప ఏదీ లభించదు. అలాగే చాలా ఆరాధన చేసేవారిలో చాలా మందికి తన ఆరాధన ద్వార నొప్ప మరియు బాధ తప్ప ఏది పొందరు” ఆ తరువాత ఇమామ్ సాదిఖ్(అ.స) ఉల్లేఖిన మరో హదీస్ చదివారు, అందులో ఇమామ్(అ.స) ఇలా ప్రవచించారు: “నీవు ఉపవాస దీక్షను నిర్వర్తిస్తున్నప్పుడు నీ చెవులు, కళ్లూ, వెంట్రుకలు, చర్మం మరియు శరీర భాగాలన్నీ ఉపవాసం ఉండాలి” ఇలా కూడా ఉపదేశించారు: ఉపవాసం కేవలం అన్నపానియాలను వదిలేయడం మాత్రమే కాదు, ఎప్పడైతే ఉపవాసం ఉంటావో నీ నాలుక అబద్ధాల నుంచి సురక్షితంగా ఉండాలి, కళ్లను హరామ్ ను చూడకుండా సురక్షితంగా ఉంచుకోవాలి, పరస్పరం దెబ్బలాడుకోకూడదు, అసూయ పడకూడాదు, చాడీలు చెప్పకూడదు, ఒకరికి గురించి చెడుగా చెప్పకూడదు, తిట్టకూడాదు, హింసించకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, శత్రుత్వం, అబద్ధం, నిందలు వేయడం, చాడీలు చెప్పడం నుంచి దూరంగా ఉండాలి. అంతిమదినాన్ని మరవకూడదు. మన కాలపు ఇమామ్(అ.స) ప్రత్యక్షం గురించి వేచి ఉండాలి.
అల్లాహ్ మాటిచ్చిన విషయాల గురించి వేచి ఉండండి. సత్కార్యములను పరలోక ప్రయాణం కోసం సంగ్రహించుకోండి. నిత్యం మనశాంతి మరియు సంతృప్తి గా ఉండండి. అల్లాహ్ పట్ల వినయవిధేయతలు ఒక దాసుడు తన యజమాని పట్ల ఉండే భయం మాధిరి ఉండాలి. అల్లాహ్ శిక్షకు భయపడండి. ఆయన కారుణ్యం పట్ల ఆశ కలిగివుండండి. ఆ తరువాత నాకు దైవప్రవక్త(స.అ)కు జరిగిన ఒక సంఘటనను చెప్పారు.
దైవప్రవక్త(స.అ) ఒక స్ర్తీను తిడుతుండగా చూశారు; ఆమె తన దాసులను తిడుతుంది, అప్పుడు ఆమె ఉపవాసంతో ఉంది. అయితే దైవప్రవక్త(స.అ) ఆమెను తన వద్దకు పిలిచారు. భోజనం తెప్పించి ఆమెతో తిను అని అన్నారు. ఆమె ఓ దైవప్రవక్త(స.అ) నేను ఉపవాసంతో ఉన్నాను అని అంది. దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: నువ్వేలా ఉపవాసంతో ఉన్నాను అని చెబుతున్నావు, నువ్వు నీ దాసిని తిడుతున్నావు, ఉపవాసం అంటే కేవలం తినకుండా మరియు త్రాగకుండా ఉండడం కాదు, అల్లాహ్ తినడం మరియు త్రాగడంతో పాటు చెడు మాట మరియు చర్యలకు కూడా దూరంగా ఉండమని నిశ్చయించాడు; ఉపవాసం ఉండేవారు చాలా తక్కువ మరియు ఆకలితో ఉండేవారు చాలా ఎక్కువ.
రిఫరెన్స్
అల్ ఫత్వా అల్ ముయస్సిరహ్, అబ్దుల్ హాదీ మొహమ్మద్ తఖీ అల్ హకీమ్, పేజీ197.
వ్యాఖ్యలు
Masha Allah
వ్యాఖ్యానించండి