సుప్రీమ్ నేత

శుక్ర, 06/02/2023 - 19:33

ఇరాన్ దేశంలో ఇస్లామీయ విప్లవా నాయకుడు మరియు ధర్మవేధి అయిన ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) గురించి సంక్షిప్త వివరణ...

సుప్రీమ్ నేత

ఆయతుల్లాహ్ ఖుమైనీ గారి పేరు సయ్యద్ రూహుల్లాహ్, వారి ఇంటిపేరు ముస్తఫవీ, వారి వంశం మూసవీ ఖుమైనీ. తండ్రి పేరు సయ్యద్ ముస్తఫా, తల్లి పేరు హాజర్. వారు సెప్టెంబర్ నెల 24వ తేదీ 1902వ సంవత్సరం ఖుమైన్ పట్టణం (ఇరాన్) లో జన్మించారు. భార్య పేరు బానూ ఖదీజహ్(ఆయతుల్లాహ్ మీర్జా ముహమ్మద్ సఖఫీ కుమార్తే).  వారు ఫిఖ్, ఉసూల్, ఫిలాసఫీ, ఇర్ఫాన్, అఖ్లాఖ్, కలామ్ మరియు రాజకీయం మొ... వాటిలో నిపుణులు. వారిలో ఉన్న ప్రత్యేకతలు: ఖుమ్ ఇస్లామీయ విధ్యాలయ ఉపాధ్యాయులు. ఇరాన్ ఇస్లామీయ విప్లవ నాయకుడు. ముస్లిముల నాయకుడు మరియు ఇస్లామీయ అధికార స్థాపకుడు.
బానిసత్వం, లొంగుబాటు(Capitulation)కు వ్యతిరేకించడం వల్ల వారిని దేశబహిష్కరణ చేసి టర్కీకు పంపారు. దేశబహిష్కరణ యొక్క 15 సంవత్సరాల తరువాత ఇరాన్ తిరిగి వచ్చారు. వారు 13 సంవత్సరాలు నజఫ్(ఇరాఖ్)లో ఉన్నారు. వారు తిరిగి ఇరాన్ కు వచ్చిన 11 రోజుల తరువాత అనగా ఇరానీ క్యేలండరు ప్రకారం బెహ్మన్ నెల 22 తారీఖున స్వాతంత్ర్యం దక్కింది. స్వాతంత్ర్యం తరువాత పది సంవత్సరాల ఆరు మాసాల వరకు వారే సూప్రీమ్ నేతగా ఉన్నారు.
వారు 27 సంవత్సరాల వయసులో 1929లో మరణించారు. ఇరానీ ఖుర్దాద్ నెల 14న తారీఖు 1368 - జూన్ 4వ తేదీ 1989. వారిని టెహ్రాన్ – ఇరాన్, బెహిష్తె జహ్రా(స.అ) స్మశానం సమాధి చేశారు.
వారి రచనలు:
1. సహీఫయే ఇమామ్-22 సంపుటములు 2. దీవానె అష్ఆర్ 3. షర్హె దుఆయె సహ్ర్ 3. షర్హె 40 హదీస్ 4. షర్హె హదీసె జునూదె అఖ్ల్ వ జెహ్లె ఇర్ఫానీ 5. తాలీఖహ్ బర్ ఫవాయిదుర్ రిజ్వీయ్యహ్ 6. తఅలీఖాతున్ అలా షర్హె ఫుసూసిల్ హికమ్ వ మిస్బాహుల్ ఉన్స్ 7. మిస్బాహుల్ హిదాయహ్ ఇలల్ ఖిలాఫతి వల్ విలాయహ్ 8. సిర్రుస్ సలాహ్ 9. మేరాజుస్ సాలికీన్ వ సలవాతుల్ ఆరిఫీన్ 10. ఆదాబుస్ సలాహ్ 11. మనాహిజుల్ వుసూల్ ఇలా ఇల్మిల్ ఉసూల్ 12. రసాయిల్ – 2 సంపుటములు 13. తాలీఖతు అలల్ ఉర్వతుల్ ఉస్ఖా 14. అల్ తహారహ్ – 3 సంపుటములు 15. మకాసిబె మొహర్రమహ్ – 2 సంపుటములు 17. తఅలీఖతు అలా వసీలతిన్ నజాహ్ 18. తహ్రీరుల్ వసీలహ్ – 2 సంపుటములు 19 అల్ బై – 5 సంపుటములు మొ...,

ఇస్లామీయ అధికార స్థాపన ఇమామ్ ఖుమైనీ(ర.అ) నోట
ఇరాన్ దేశంలో ఇస్లామీయ అధికారం రావాలనీ ఆ దేశస్తులు చాలా ప్రయత్నించారు. ఇస్లామీయ అధికారం కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారు. ఇస్లాం ఆదేశాలు పాటించబడాలంటే ఇస్లామీయ అధికారం రావాలనే వారి గట్టి నమ్మకం ద్వార అల్లాహ్ వారికి ఈ విజయాన్ని ప్రసాదించాడు. ఈ విజయం వారికి ఎలా సొంతమయ్యింది అన్న విషయాన్ని ఇస్లామీయ విప్లవ నాయకుడు ఇమామ్ ఖుమై(ర.అ) ఇలా వివరించారు: “మా దేశంలో మీరు చూస్తున్న ఈ మార్పు, దీనంతటికి కారణం మొదటి నుండే వారి పిలుపు “మాకు ఇస్లాం అధికారం కావాలీ, దౌర్జన్యపాలన మాకొద్దు”, అదే అల్లాహ్ యొక్క దయను తమ వైపుకు ఆకర్షించుకుంది....”[1]

ఇస్లామీయ విప్లవానికి కారణం
ఇరాన్ ఇస్లామీయ విప్లవం, యావత్ ప్రపంచానికి కదిలించి వేసింది. తూర్పు నుండి పడమర వరకు ప్రతీ ఒక్కరి నోట ఒకే విప్లవ చర్చ, అదే ఇస్లామీయ విప్లవ చర్చ. ఇదంతా ఎవరు చేశారు? ఈ విప్లవాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఏ ఒక్క ఇరాన్ దేశస్తుడు చెప్పగలడా “ఔను నేనే స్వాతంత్రాన్ని తీసుకొచ్చాను, విప్లవాన్ని తీసుకొచ్చాను" అని? నిస్సందేహంగా ఇలా వ్యాజించలేడు. ఈ మార్పూ, ఈ విప్లవం కేవలం దైవికమైన విప్లవం. అల్లాహ్ యే ఈ విప్లవాన్ని తీసుకొచ్చాడు. అందుకనే ఏ ఒక్కడు కూడా ఈ విప్లవానికి తానే కారణంగా చెప్పుకోడు, చివరికి ఎంతో ప్రతిష్టతగల మరియు సాటిలేని త్యాగలు చేసిన ఇమామ్ ఖుమైనీ(ర.అ) కూడా ఈ విప్లవానికి కారణంగా చెప్పుకోలేదు. నిరంతరం “ఈ విప్లవం ఇరానీయుల యొక్క నిష్కపట మరియు శ్రమతో కూడిన ప్రయత్నాలకు ఫలితం” అని చెప్పేవారు. ఈ మాటలను పరిశీలిస్తే ఇమామ్ ఖుమైనీ(ర.అ) సరిగ్గా చెప్పారు అని తెలుస్తుంది. నిజానికి ఇమామ్ ఖుమైనీ(ర.అ) ప్రజలకోసం కేవలం ఒక జరియా మరియు దైవిక సాధనము మాత్రమే ఈ ఇస్లామీయ విప్లవానికి ప్రధానం అల్లాహ్ యే ఎందుకంటే ఇరానీయులు స్వచ్ఛతతో, నిష్కపటముగా మరియు అల్లాహ్ మార్గంలో ఇస్లామీయ విప్లవానికి ముందడుగు వేశారు అందుకని అల్లాహ్ ఆజ్ఞ మరియు దయ కూడా వారికి తోడయ్యింది. ప్రజల స్వచ్ఛత వలనే అల్లాహ్ ఈ ఇస్లామీయ విప్లవాన్ని తాయీదు చేశాడు.[2].

రిఫ్రెన్స్
1. ఇన్ఖిలాబె ఇస్లామీ వ రీషెహాయే ఆన్, ఆయతుల్లాహ్ మిస్బాహ్ యజ్దీ, ఇంతెషారాతె ముఅస్ససే ఆముజిషి వ ఫజూహిషీ ఇమామ్ ఖుమైనీ(ర.అ).
2. ఆయతుల్లాహ్ ఖామెనయి, అఖ్లాఖ్ వ మానవియత్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3