సవీఖ్ యుద్ధం

శని, 06/24/2023 - 14:56

జిల్‌హిజ్ మాసం హిజ్రీ యొక్క రెండవ సంవత్సరంలో జరిగిన సవీఖ్ యుద్ధం గురించి సంక్షిప్త వివరణ...

సవీఖ్ యుద్ధం

సవీఖ్ యుద్ధం, జిల్‌హిజ్ మాసం హిజ్రీ యొక్క రెండవ సంవత్సరంలో జరిగింది. ప్రతిసైన్యం రూపంలో ముష్రిక్కుల సైన్యం అబూసుఫ్యాన్ ఆధిపాత్యంలో ఉండింది.[1]

ఏమి జరిగిందంటే బద్ర్ యుద్ధంలో అపజయం తరువాత అబూసుఫ్యాన్ మక్కాకు తిరిగి వచ్చిన తరువాత మరలా దైవప్రవక్త(స.అ)తో యుద్ధం జరగనంత వరకు తన భార్యల వద్దకు వెళ్లను అని ప్రమాణం చేశాడు. ముస్లిములతో యుద్ధం చేసేందుకు ఖురైషీయులకు కవిత్వాలు మరియు గేయాలు ఈ విధంగా వినిపించేవాడు: “యస్రబ్ మరియు దాని ఇరుగుపొరుగు వారి పై దాడి చేయండి, దాంతో వాళ్ల ధనం మీ సొంతం అవుతుంది. బద్ర్ లో వాళ్లు విజయాన్ని సాధించారు ఇక విజయం మీ వంతు. ఔస్ వ ఖజ్రజ్ సంఘాలను నాశనం చేయనంత వరకు నేను నా భార్యలకు దగ్గరవ్వనని, తల మరియు ఒంటి మీద నీళ్లు వేసుకోనని ప్రమాణం చేశాను; ఎందుకంటే నా హృదయం దుఖంతో మండిపోతుంది”[2]

అబూసుఫ్యాన్ ఖురైష్ కు చెందిన 40[3] 100[4] లేదా 200[5] కాఫిరు(అవిశ్వాసుల)తో కలిసి మక్కా నుండి బయటకు వచ్చి నజ్దియహ్ మార్గాన్ని సద్ర్ ఖనాతహ్ ప్రదేశానికి మదీనహ్ కు కొంచెం దూరంలో ఉన్న తీత్ కొండ వరకు వచ్చారు. అతడు ముందుగా రాత్రి చీకటిలో యూదుల సమూహం బనీ నజీర్ నాయకుల నుండి అయిన హై ఇబ్నె అఖ్తబ్ వద్దకు సహాయం కోసం వెళ్లాడు, కాని హై అతడి దరఖాస్తును రద్దు చేశాడు. ఆ తరువాత బనీ నజీర్ సమూహం యొక్క కోశాధ్యక్షుడు అయిన సలామ్ ఇబ్నె మష్కమ్ నుండి కొన్ని వార్తలు తెలుకొని తన సైన్యం వద్దకు తిరిగి వచ్చాడు. వారిలో కొందరిని మదీనహ్ వైపుకు పంపాడు. వారు అరీజహ్ ప్రదేశానికి వెళ్లి కొన్ని చెట్లను నిప్పంటిచారు, అన్సారులకు చెందిన ఒకరిని తన పొలంలో చంపి తిరిగి వచ్చారు.[6]

ఆ తరువాత వాళ్లు చేసిన చర్యలు దైవప్రవక్త(స.అ)కు కష్టం కలిగించడంతో వారు అబూ లబాబహ్ ను మదీనహ్ లో తన స్థానంలో ఉంచి[7] 200 మందితో కూడిన సైన్యంతో అబూసుఫ్యాను వెంటాడారు, ఖిర్‌ఖిరతుల్ కదర్ వరకు వెళ్లారు కాని వాళ్లు కనబడలేదు, అక్కడ నుండి తిరిగి మదీనహ్ కు తిరిగి వచ్చారు.[8]

అయితే దైవప్రవక్త(స.అ) వారిని వెంటాడుతున్న విషయం తెలుకున్న ఖురైష్ సైన్యం భయంతో తమ బరువును తగ్గించుకోవడం కోసం తమ ఆహార పదార్థాలు అందులో ఎక్కువగా సవీఖ్[9]ను వదిలి మక్కా వైపుకు పురుగులు తీశారు! ముస్లిముల సైన్యం ఆ ఆహార పదార్థాలను యుద్ధ వ్యర్ధాలుగా తీసుకున్నారు; ఈ విధంగా ఈ సంఘటనను “గజ్వ-ఎ-సవీఖ్” ప్రఖ్యాతి చెందింది.[10].

ఇస్లాం సైన్యం తిరిగి వచ్చిన తరువాత, ముస్లిములు దైవప్రవక్త(స.అ)తో ఈ దాడి మరియు యుద్ధ చర్యలను ఒక యుద్ధంగా లెక్కించగలమా!? వారు ముస్లిముల మాటను సమ్మతిస్తూ సమాధానం ఇచ్చారు[11].

రిఫరెన్స్
1. తబరీ, అబూ జాఫర్ మొహమ్మద్ ఇబ్నె జరీర్, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్(తారీఖె తబరీ), తహ్ఖీఖ్, ఇబ్రాహీమ్, మొహమ్మద్ అబుల్ ఫజ్ల్, భాగం2, పేజీ483, బీరూత్, దారుత్తురాస్, చాప్2, 1387ఖ.
2. తబరీ, అబూ జాఫర్ మొహమ్మద్ ఇబ్నె జరీర్, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్(తారీఖె తబరీ), తహ్ఖీఖ్, ఇబ్రాహీమ్, మొహమ్మద్ అబుల్ ఫజ్ల్, భాగం2, పేజీ484, బీరూత్, దారుత్తురాస్, చాప్2, 1387ఖ.
3. మఖ్రీజీ, తఖియ్యుద్దీన్, ఇమ్తావు బిమా లిన్నబీ(స.అ), తహ్ఖీఖ్, నమీసీ, మొహమ్మద్ అబ్దుల్ హమీద్, భాగం1, పేజీ123, బీరూత్, దారుల్ కుతుబ్ అల్ ఇల్మియహ్, చాప్1, 1420ఖ
4. తబర్సీ, ఫజ్ల్ ఇబ్నె హసన్, అఅలాముల్ వరా, పేజీ78, తహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, చాప్3, 1390ఖ
5. తబరీ, అబూ జాఫర్ మొహమ్మద్ ఇబ్నె జరీర్, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్(తారీఖె తబరీ), తహ్ఖీఖ్, ఇబ్రాహీమ్, మొహమ్మద్ అబుల్ ఫజ్ల్, భాగం2, పేజీ485, బీరూత్, దారుత్తురాస్, చాప్2, 1387ఖ.
6. తబరీ, అబూ జాఫర్ మొహమ్మద్ ఇబ్నె జరీర్, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్(తారీఖె తబరీ), తహ్ఖీఖ్, ఇబ్రాహీమ్, మొహమ్మద్ అబుల్ ఫజ్ల్, భాగం2, పేజీ484, బీరూత్, దారుత్తురాస్, చాప్2, 1387ఖ.
7. మఖ్రీజీ, తఖియ్యుద్దీన్, ఇమ్తావు బిమా లిన్నబీ(స.అ), తహ్ఖీఖ్, నమీసీ, మొహమ్మద్ అబ్దుల్ హమీద్, భాగం1, పేజీ123, బీరూత్, దారుల్ కుతుబ్ అల్ ఇల్మియహ్, చాప్1, 1420ఖ.
8. ఇబ్నె సఅద్ కాతిబె వాఖిదీ, మొహమ్మద్ ఇబ్నె సఅద్, అల్ తబఖాతుల్ కుబ్రా, తహ్ఖీఖ్, అతా, మొహమ్మద్ అబ్దుల్ ఖాదిర్, భాగం2, పేజీ23, బీరూత్, దారుల్ కుతుబ్ అల్ ఇల్మియహ్, చాపె అవ్వల్, 1410ఖ.
9. సవీఖ్ అని గోదుమ లేదా బార్లీ గింజల పిండిని అంటారు.
10. మఖ్రీజీ, తఖియ్యుద్దీన్, ఇమ్తావు బిమా లిన్నబీ(స.అ), తహ్ఖీఖ్, నమీసీ, మొహమ్మద్ అబ్దుల్ హమీద్, భాగం1, పేజీ123, బీరూత్, దారుల్ కుతుబ్ అల్ ఇల్మియహ్, చాప్1, 1420ఖ.
11. ఇబ్నె హిషామ్, అబ్దుల్ మలిక్, అల్ సీరతున్ నబవియహ్, తహ్ఖీఖుస్ సఖా, ముస్తఫా, అల్ అబియారీ, ఇబ్రాహీమ్, షుబ్లీ, అబ్దుల్ హఫీజ్, భాగం2, పేజీ45, బీరూత్, దారుల్ మరిఫత్, చాప్1, బీతా.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16