తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతి ప్రదర్శించిన వారికి ఇవ్వబడే పుణ్యాల వివరణ రివాయతుల ఆధారంగా...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
మనం ఈ ప్రపంచంలో చేసే ఏ పనైనా సరే, అది మంచి కానివ్వండి లేదా చెడు కానివ్వండి దాని ప్రతి ఫలం తప్పనిసరిగా ఉంటుంది అని రివాయతులు ఉపదేశిస్తున్నాయి. ఒకవేళ ఈలోకంలో కాకపోతే పరలోకంలో ఇవ్వబడుతుంది.
ఇలాంటి చర్యలలో ఒకటి తల్లదండ్రుల పట్ల ఉత్తమ రీతి కలిగి ఉండడం మరియు వారి ఆజ్ఞను పాటించడం. వారి పట్ల మన ప్రవర్తన మంచి ఉంటే ఎటువంటి అనుగ్రహాలు, శుభాలు మరియు ఇన్ఆములు ఇవ్వబడతాయి అన్న విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. అధిక వరాలు
తల్లిదండ్రుల పట్ల ఉత్తమరీతి కలిగి ఉన్న వారికి ఖైరె కసీర్ (అనగా అత్యధికంగా వరాలు) ప్రసాదించబడతాయి.[1]
2. దైవప్రవక్త(స.అ) గౌరవానికి అర్హులు
చరిత్రలో చాలా సంఘటనలు తల్లిదండ్రుల పట్ల ఉత్తమరీతి గల వారి పట్ల దైవప్రవక్త(స.అ) గౌరవ ప్రవర్తన గురించి లిఖించబడి ఉంది.[2]
3. అల్లాహ్ ప్రసన్నత
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: తల్లిదండ్రుల సంతోషంలోనే అల్లాహ్ సంతోషం ఉంది...[3]
4. ఉపాది మరియు భాగ్యానుగ్రహం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఉపాది మరియు సుదీర్ఘ జీవితం కావాలంటే తల్లిదండ్రులతో సంబంధం తప్పని సరి ఎందుకంటే వారితో సంబంధం అల్లాహ్ పట్ల విధేయత కాబట్టి.[4]
5. దైవప్రవక్త(అ.స) తో సహవాసం
తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతి ప్రదర్శించిన వారు స్వర్గంలో దైవప్రవక్త(అ.స)తో పాటు కలిసి ఉంటారు అని చాలా రివాయతులు మరియు సంఘటనలు నిదర్శిస్తున్నాయి.[5]
6. చిక్కుల నుండి విముక్తి
స్వచ్ఛమైన నియత్తుతో తల్లిదండ్రులకు సేవలు అందించడం పట్ల కూడా చరిత్రలో చాలా సంఘటనలు వివరించబడి ఉన్నాయి.[6]
7. శిక్షల నుండి రక్షణ ఇస్తుంది
ఇబ్రాహీమ్ ఇబ్నె షుఐబ్ ఇమామ్ జాఫరె సాదిఖ్(స.అ) నా తండ్ర చాలా వృధ్యాప్యానికి చేరుకున్నారు, మలమూత్రాల కోసం వారిని భుజాల పై ఎత్తుకొని వెళ్తాను అని అన్నాను. ఇమామ్ అతడితో నీలో శక్తి ఉంటే నువ్వే ఈ పనులను చేయి. అంతేకాకుండా స్వయంగా నీ చేతులతోనే నువ్వు ముద్దలు చేసి తినిపించు ఇది రేపు ప్రళయదినంలో నీకు రక్షణగా నిలుస్తుంది.[7]
8. తల్లిదండ్రుల సేవలో అప్రమత్తం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఉత్తమ రీతి కలిగి ఉండు దాంతో స్వర్గానికి వెళతావు, చెడు రీతి కలిగి ఉంటే నరకాగ్నిలో వెళతావు.[8]
9. అల్లాహ్ నీడలో జీవిస్తాడు
రివాయతనుసారం: హజ్రత్ మూసా ఇబ్నె ఇమ్రాన్ అల్లాహ్ తో మునాజాత్ చేస్తుండగా ఒక వ్యక్తిని మబ్బు నీడలో ఉన్న వ్యక్తిని చూసి అల్లాహ్ తో కారణం అడగగా అతడు తన తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతిని ప్రదర్శించడం మరియు విమర్శలకు దూరంగా ఉండడం వల్ల అని సమాధానం వచ్చెను.[9]
10. నీ తల్లిదండ్రులను గౌరవించు నువ్వూ గౌరవించబడతావు
రివాయతులనుసారం నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతి కలిగి ఉండండి, నీ పిల్లలు కూడా నీ పట్ల ఉత్తమ రీతి కలిగివుంటారు.[10]
11. సులువుగా ప్రాణాలు తీయబడడం
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖననుసారం ఎవరైతే మృత్యువు సమయంలో సులభంగా ప్రాణాలు పోవాలి అని అనుకుంటున్నారో వాళ్లు తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతీని ప్రదర్శించాలి.[11]
12. ప్రళయంలో సులభంగా లెక్కతీసుకోబడుతుంది
దైవప్రవక్త(స.) ఉల్లేఖనం: తల్లిదండ్రుల పట్ల ఉత్తమరీతి మరియు బంధుమిత్రులతో కలిసి ఉండడం వల్ల సులభంగా లెక్కతీసుకోబడుతుంది.[12]
13. జీవిత కాలం పేరుగుతుంది
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఎవరైనా జీవితం మరియు ఉపాధిలో అభివృద్ధి పొందాలనుకుంటే తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతి కలిగివుండాలి.[13]
14. నాయకులు అవుతారు
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: తల్లిదండ్రుల మరణానంతరం వారి పట్ల ఎహ్సాన్ చేసేవారు ప్రళయదినాన ఉత్తముల నాయకులు అవుతారు.[14]
రిఫరెన్స్
1. నుజ్ హతున్నాజిర్ వ తంబీహుల్ ఖాతిర్, భాగం1, పేజీ8.
ما یمنع الرجل منکم ان یبر والدیه حیین و میتین یصلی عنهما و یتصدق عنهما و یحج عنهما و یصوم عنهما فیکون الذی صنع لهما و له مثل ذلک فیزیده الله عزوجل ببره و صلته خیرا کثیرا
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ55.
فقال لانھا کانت ابر بوالدیھا منه
3. బుజుర్గ్ సాల్ వ జవాన్, భాగం1, పేజీ53.
رضی اللہ و رضی الوالدین۔۔۔
4. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ85.
مَنْ سَرَّهُ أَنْ یُمَدَّ لَهُ فِی عُمُرِهِ وَ یُبْسَطَ فِی رِزْقِهِ فَلْیَصِلْ أَبَوَیْهِ
5. బుజుర్గ్ సాల్ వ జవాన్, భాగం1, పేజీ55.
6. తఫ్సీరె మన్హజుల్ మసాదీఖ్, హదీస్5, పేజీ329.
7. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, ఉసూలె కాఫీ, బాబొ బిర్రుల్ వాలిదైన్)
8. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ60.
9. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ65.
هذا کان بارّ الوالدیه و لم یمش بالنمیمة
10. తవీసరానీ, హుసైన్, పిదర్, మాదర్ వ ఫర్జన్ద్, పేజీ55, ఫాతెమతుజ్ జహ్రా, 1370.
11. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, హదీస్71, పేజీ65.
12. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ85.
13. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ85.
14. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ86.
వ్యాఖ్యానించండి