ముస్లిముల విశ్వాసాలనుసారం ఇమామత్ మరియు విలాయత్ విశ్వాసం ఖుర్ఆన్ దృష్టిలో...
షియా వర్గం యొక్క మూల విశ్వాశాల నుండి ఒకటి ఇమామత్ విశ్వాసం.
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: (ఓ ప్రవక్తా! ఆ సందర్భాన్ని కూడ గుర్తుకు తెచ్చుకోండి) ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నిటిని అతను పూర్తి చేయగా(వాటన్నిటిలో పూర్తిగా నెగ్గిన తరువాత) (అల్లాహ్) ఇలా అన్నాడు: నేను నిన్ను మానవులందరికీ ఇమామ్‌గా(నాయకునిగా) చెయ్యబోతున్నాను. ఇబ్రాహీమ్ తన ప్రభువుతో ఇలా అడిగారు: ఇది నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్ అనెను: నా ఈ అధికారం జాలిములైన(దుర్మార్గులైన) వారికి వర్తించదు[1]
ఈ ఆయత్‌లో ఇలా ప్రవచించబడి ఉంది; ఇమామత్ అల్లాహ్ యొక్క అధికారం, అల్లాహ్ తన దాసులలో ఎవరికి ప్రసాదించాలను కుంటే వారికి ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఈ ఆయత్‌లో “جَاعِلُكَ لِلنَّاسِ إِمَامٗا” అని వచ్చింది దానితో పాటు ఈ ఆయత్, అల్లాహ్ యొక్క అధికారం కేవలం ఆయన ఎవరినైతే ఈ అధికారం కోసమే ఎన్నుకున్న ఆ మంచి దాసులకే ప్రసాదించబడుతుంది. మరి అన్యాయులకు ఈ అధికారం దక్కదు.
ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్(అ.స)
దైవప్రవక్త(స.అ) కరుణకు ప్రతిరూపంగా నియమించి అవతరించబడ్డారు. మరియు అతని ఉమ్మతే అన్ని ఉమ్మతులలో ఉత్తమమైనదిగా ఉండాలని చాలా ఆశతో ఉండేవారు. అతని తరువాత ఎటువంటి భేదం ఏర్పడకూడదు అందుకని దైవప్రవక్త(స.అ)కు ఉమ్మత్ కోసం ఒక పద్ధతిని నిర్ణయించి వెళ్ళవలసిన అవసరం ఎంతైన ఉంది. మరియు అందుకే సహాబీయులు ముహద్దిసీనులు ఆయన నుండి రివాయత్‌ను ఇలా ఉల్లేఖించారు: “మీ మధ్య రెండు అమూల్యమైన వాటిని వదిలి వెళ్తున్నాను ఆ రెండింటితో కలిసి ఉన్నంతవరకు మీరు దారి తప్పరు (ఆ రెండు) ఖుర్ఆన్ మరియు నా ఇత్రత్ (అనగా) అహ్లెబైత్[అ.స]లు. ఆ రెండు నా వద్దకు (కౌసర్) సేలయేరు పై చేరనంత వరకు దూరం అవ్వరు. ఇక చూద్దాం మీ ప్రవర్తన వాళ్ళ పట్ల ఎలా ఉంటుందో”.[2]
ఇమామ్ అలీ(అ.స) యొక్క విలాయత్ ప్రస్తావన ఖుర్ఆన్‌లో
“అబూజరె గఫ్ఫారీ” ఇలా అన్నారు: ...దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “అలీ(అ.స) మంచివాళ్ళకి నాయకుడు, అవిశ్వాసులకు ఘాతకుడు, అలీ(అ.స) కి సహాయపడినవారు విజేత అవుతాడు. సహాయపడనివాడు అమర్యాదుడవుతాడు”. ఒకసారి నేను దైవప్రవక్త(స.అ)తో పాటు నమాజ్ చదివాను ఇంతలో ఒక యాచకుడు యాచించగా ఎవరూ అతడికి ఏమీ ఇవ్వలేదు, అప్పుడు హజ్రత్ అలీ(అ.స) (నమాజ్ యొక్క) రుకూ స్థితిలో ఉన్నారు. అతను తన ఉంగరం ఉన్న చిటికెన వ్రేలుతో సైగ చేశారు ఆ యాచకుడు వచ్చి ఆ ఉంగరాన్ని తీసుకున్నాడు అప్పుడు దైవప్రవక్త(అ.స) అల్లాహ్ సన్నిధిలో ఇలా దుఆ చేశారు: ఓ నా ప్రభువా! నా సోదరుడు మూసా(అ.స) నీతో ఇలా కోరారు: “ఓ నా ప్రభువా! నా హృదయాన్ని తెరువు, నా కార్యాన్ని నా కొరకు సులభం చేయ్యి, నా మాటలు జనానికి అర్ధమైయ్యేందుకు నా నాలుక ముడిని విప్పు, నా అహ్లెబైత్ల నుండి నా సోదరుడు హారూన్‌ను నా ఉత్తరాధికారిగా నియమించు, అతని ద్వార నన్ను పటిష్టం చేయ్యి, అతనిని నా కార్యములలో సహాయపడేలా చెయ్యి, మేము నీ పవిత్రతను అత్యధికంగా ప్రకటించేటందుకు మరియు నిన్ను ఎక్కువగా స్మరించేటందుకు, నీవు ఎల్లపుడూ మా స్థితిని కనిపెట్టే ఉన్నావు”. నీవు, “మూసా! నీ పూర్తి దుఆ అంగీకరించబడింది” అని అతనికి దైవవాణి ద్వారా తెలిపావు. ప్రభువా! నేనూ నీ దాసుడనే, నీ ప్రవక్తనే. అందుకని నా హృదయాన్ని కూడా తెరువు, నా కార్యాన్ని కూడా సులభం చెయ్యి, నా అహ్లెబైత్(అ.స) నుండి అలీ(అ.స)ని నా ఉత్తరాధికారిగా నియమించు అతని ద్వారా నన్ను పటిష్టం చెయ్యి” అబూజర్ ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా దైవప్రవక్త(అ.స) యొక్క దుఆ ఇంకా పూర్తి కూడా కాలేదు ఇంతలో జిబ్రయీల్(అ.స) ఈ ఆయత్
ను పై నుండి తీసుకొని వచ్చారు: వాస్తవానికి మీ వలీ(అధికారులు, స్వామి, యజమాని) కేవలం అల్లాహ్, అల్లాహ్ ప్రవక్త, నమాజులు స్థాపించే మరియు రుకూ స్థితిలో జకాత్ ఇచ్చే విశ్వాసులు మాత్రమే. అల్లాహ్
నూ, ఆయన ప్రవక్తనూ, విశ్వాసులనూ తమ వలీయులుగా స్వీకరించేవాడు (అల్లాహ్ సైన్యంలో చేరారు) నిస్సందేహముగా అల్లాహ్ సైన్యమే ఆధిక్యమైనది[మాయిదహ్ సూరా:5, ఆయత్:55,56]. [3]
రిఫ్రెన్స్
1. అల్ బఖరహ్ సూరా:2, ఆయత్:124.
وَإِذِ ٱبۡتَلَىٰٓ إِبۡرَٰهِۧمَ رَبُّهُۥ بِكَلِمَٰتٖ فَأَتَمَّهُنَّۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامٗاۖ قَالَ وَمِن ذُرِّيَّتِيۖ قَالَ لَا يَنَالُ عَهۡدِي ٱلظَّٰلِمِينَ;
2. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ148
تَرَكْتُ فِيكُمُ الثَّقَلَيْنِ مَا إِنْ تَمَسَّكْتُمْ بِهِمَا لَنْ تَضِلُّوا بَعْدِي ابدا كِتَابُ اللَّهِ وَ عِتْرَتِي أَهْلُ بَيْتِي لَنْ يَفْتَرِقَا حَتَّى يَرِدَا عَلَيَّ الْحَوْضَ فَانْظُرُوا كَيْفَ تَخْلُفُونِّي فِيهِمَا
3. సఅలబీ, తఫ్సీర్ అల్ కబీర్‌లో మాయిదహ్ సూరా:5, ఆయత్:55,56 వ్యాఖ్యానం క్రమంలో.
వ్యాఖ్యానించండి