మృత్యువు మరియు ప్రళయ దినం గురించి సంక్షిప్త వివరణ...
ప్రజలు మృత్యువు మరియు మృత్యువు తరువాత ఉండే స్థితుల కన్నా మృతుడు మరియు అతడి దేహాన్ని చూసి భయపడుతూ ఉంటారు.
ఆలోచించవలసిన విషయమేమిటంటే మేము ఎవర్ని చూసి భయపడుతున్నాము; అతడు కొంత సమయం ముందు ప్రాణాలతో ఉన్నాడు మరియు నీ వలే తింటూ, త్రాగుతూ, ఏడుస్తూ, నవ్వుతూ, తనను తాను శుభ్రంగా ఉంచుకుంటూ మరియు నిద్రపోతూ ఉండే వాడు. ఆ తరువాత అతడి పై ప్రాణుల పై జరిగే విధంగా మృత్యువు మైకం యొక్క దాడి జరిగింది. నువ్వు యదార్థాన్ని ఎందుకని అంగీకరించవు, నిజానికి నువ్వు మృతుడి కన్నా మృత్యువు పట్ల ఎక్కువ భయం కలిగి ఉండాలి, నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా మునుపటి ఉమ్మత్ వాసులు మరియు వారి సంతానం ఎక్కడికి వెళ్లిపోయారు అని, ఈనాడు వాళ్ల నిలయం వారి సమాధులే, వారి ఆస్తులు వారి వారసులలో పంచబడ్డాయి, వారి గుర్తులు మిగిలి లేవు, వారు, వారి గురించి ఏడ్చేవారి వద్దకు రారు, మరియు వారిని పిలిచేవారికి సమాధానం ఇవ్వరు.
ఖుర్ఆన్: “వారు ఎన్నో తోటలను, ఊటలను వదలిపోయారు. మరెన్నో పచ్చని పొలాలను, చక్కని నిలయాలను, ఇంకా తాము అనుభవిస్తూ ఉండే విలాసవంతమైన వస్తువులను కూడా (వదిలిపోయారు. అంతా ఇట్టే అయిపోయింది. మేము మరో జాతి వారిని వాటన్నింటికీ వారసులుగా చేశాము.[1] అయితే నీకు తెలిసిన వాడు ఎక్కడికి వెళ్లాడు మరియు ఎందుకని వెళ్లాడు?
నీ తాతాముత్తాతలు ఎక్కడికి వెళ్లిపోయారు, ఫలానా వ్యక్తి ఎక్కాడా?... ఫలానా వ్యక్తి ఎక్కడా?.. ఫలానా వ్యక్తి ఎక్కడా?... వాళ్లు భూమి పైనుండి భూమి క్రిందకు వెళ్లి పోయారు, విశాల ప్రదేశం నుండి ఇరుకు ప్రదేశానికి వెళ్లిపోయారు, స్వదేశం నుండి పరదేశానికి వెళ్లిపోయారు మరియు కాంతి నుండి చీకటిలో వెళ్లిపోయారు.
కవిత్వం:
کلنا فی غفلة والموت یغدو و یروح
మేమందరం నిర్లక్ష్యంగా ఉన్నాము మరియు మృత్యువు రోజంతా మన వెనకాలే తిరుగుతుంది
نخ علی نفسک یا مسکین ان کنت تنوح
ఒకవేళ నువ్వు నీ ఆత్మ పై విలాపము చేయగలిగితే చేయి
لست بالباقی ولو عمرت ما عمر نوح
నువ్వు మిగిలి ఉండవు ఒకవేళ నువ్వు నూహ్ జీవితం పొందినా సరే
ఓ అబల్ హసన్(అ.స)! అల్లాహ్ మీ పై కారుణ్యాన్ని కురుపించుగాక, మీరు మీ మృత్యువు కంటే కొంచెం ముందు చాలా మంచిగా ప్రవచించారు: “నిన్నటి వరకు నేను మీతో ఉన్నాను, ఈ రోజు మీ కోసం ఒక పాఠాన్ని అయ్యాను, రేపు నేను మీ నుండి వేరు అవుతాను, నా వెళ్లిపోవుట మీ కోసం ఒక సలహా, నా ప్రవేశం గోప్యం, నా చుట్టుప్రక్కలు శాంతి, అయితే పాఠం నేర్చుకోవాలనుకున్న వారికి నేను అనర్గళ మరియు వాకచాతుర్యం కలిగి వున్న మాటలకు మించిన ప్రబోధం”
స్వామీ! మీరు ఒకరోజు ఇలా ఉపదేశించారు: “గుర్తుంచుకోండి ఈ పల్చటి చర్మం అగ్నిని ఓర్చుకోలేదు, అందుకని మీరు మీ ఆత్మలను కరుణించండి, ఎందుకంటే మీరు ఈ ప్రాపంచిక కష్టాలలో వాటి నుండి అనుభవాన్ని పొందారు అంటే ఈ ప్రాపంచిక కష్టాలకు ఈ ఆత్మలు ఓర్చుకో లేక పోయాయి ఇక పరలోక శిక్షను ఎలా ఓర్చుకో గలవు”[2]
నువ్వు ఎవరైనా దుఃఖానికి గురి అయిన వారిని దుఃఖంలో ఉండాగా, పడిపోయిన ఉన్నవాడిని గాయాలు తగిలి ఉండగా, జ్వరంతో ఉన్న వాడి శరీరం మండుతుండగా చూశావా, అయితే నరకం యొక్క రెండు అంతస్తుల మధ్య ఉన్న ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది?
నీకు ఈ విషయం తెలిసి ఉండాలి; అగ్ని యొక్క యజమాని, అగ్ని పై కోప్పడితే అతడి కోపం వల్ల ఆ అగ్ని మంటలు ఆరిపోతుండగా దాని యజమాని చిన్న శబ్దం పై తిరిగి అగ్ని జ్వలిస్తుంది.
నువ్వు మృత్యవు మరియు మృత్యువు తరువాత కఠిన స్థితి నుండి భయపడడం మంచిది.
ఖుర్ఆన్: ఆనాడు మీరు దాన్ని చూస్తారు... పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరపున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది.[3]
అనువాదం: ఆ రోజు ప్రతి వ్యక్తీ తాను చేసుకున్న పుణ్యాన్నీ, తాను చేసిన పాపాన్నీ తన ముందు చూసుకుంటాడు. తనకూ – తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు.[4]
1. సూరయె దుఖాన్, ఆయత్25-28
کَمْ تَرَکُوا مِنْ جَنَّاتٍ وَ عُيُونٍ .وَ زُرُوعٍ وَ مَقامٍ کَريمٍ .وَ نَعْمَةٍ کانُوا فيها فاکِهينَ.کَذلِکَ وَ أَوْرَثْناها قَوْماً آخَرينَ
2. మజ్ ముఅయె వర్రామ్, భాగం1, పేజీ67
واعلموا انه لیس لهذا الجلد الرقیق صبر علی النار...الخ
3. సూరయె హజ్, ఆయత్02
يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُمْ بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ
4. సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్30
يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَا عَمِلَتْ مِنْ خَيْرٍ مُحْضَرًا وَمَا عَمِلَتْ مِنْ سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُ أَمَدًا بَعِيدًا ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ
వ్యాఖ్యానించండి