అరఫహ్ రోజు ఆమాల్

సోమ, 08/20/2018 - 16:27

జిల్ హిత్ మాసం 9వ తారీఖున అరఫహ్ రోజు అంటారు. ఆ రోజు కొన్ని ప్రత్యేక ప్రార్ధనలు చేయవలసి ఉంటాయి. వాటి వివరణ.

అరఫహ్ రోజు ఆమాల్

1. గుస్ల్ స్నానం
2. ఇమామ్ హుసైన్[అ.స] జియారత్. ఇది వెయ్యి హజ్ మరియు వెయ్యి ఉమ్రా మరియు వెయ్యి జిహాద్ లతో సమానం. ఒకవేళ ఈ రోజున ఆయన సమాధి వద్ద ఉండే భాగ్యం కలిగితే అతడికి అరఫాత్ లో ఉండేవాడికి లభించే పుణ్యం లభిస్తుంది.
3. అస్ర్ నమాజ్ తరువాత “దుఆయె అరఫహ్” కన్న ముందు ఆకాశం క్రింద రెండు రక్అత్ల నమాజ్ చదివి అల్లాహ్ ముందు చేసిన పాపాలను అంగీకరించి క్షమాపణ కోరాలి. మొదటి రక్అత్ లో “అల్ హంద్” సూరహ్ తరువాత “ఇఖ్లాస్” సూరహ్ మరియు రెండవ రక్అత్ లో “అల్ హంద్” సూరహ్ తరువాత “కాఫిరూన్” సూరహ్ చదవాలి.
4. ఒకవేళ ఆమాల్ చేయడానికి బలహీనతకు గురి కారంటే ఉపవాసం ఉండడం ముస్తహబ్.
5. అరఫహ్ రాత్రి ఆమాల్ లో ఉన్న కొన్ని “తస్బీహాత్”(స్మరణలు) చదివిన తరువాత ఈ స్మరణలను చదవాలి: “సుబ్హానల్లాహి వల్ హందు లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్”(100 సార్లు), “తౌహీద్ సూరహ్”(100 సార్లు), “ఆయతల్ కుర్సీ”(100 సార్లు), “సలవాత్”(100 సార్లు), “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్, లహుల్ ముల్కు వలహుల్ హంద్, యుహ్యీ వ యుమీత్, వ యుమీతు వ యుహ్యీ, వహువ హయ్యున్ లా యమూతు బియదిహిల్ ఖైర్, వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్”(10 సార్లు), “అస్తగ్ఫిరుల్లాహల్లజీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహ్”(10 సార్లు), “యా అల్లాహ్”(10 సార్లు), “యా రహ్మాను”(10 సార్లు), “యా బదీఅస్సమావాతి వల్ అర్జి యా జల్ జలాలి వల్ ఇక్రామ్”(10 సార్లు), “యా హయ్యూ యా ఖయ్యూమ్”(10 సార్లు), “యా హన్నాను యా మన్నాన్”(10 సార్లు), “యా లా ఇలాహ ఇల్లా అంత్”(10 సార్లు), “ఆమీన్”(10 సార్లు) చెప్పాలి. ఆ తరువాత ఈ దుఆ చదవాలి: “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక యా మన్ హువ అఖ్రబు ఇలయ్య మిన్ హబ్లిల్ వరీద్, యా మన్ యహూలు బైనల్ మర్యి వ ఖల్బిహ్, యా మన్ హువ బిల్ మన్జరిల్ అఅలా వ బిల్ ఉఫుఖిల్ ముబీన్, యా మన్ హువర్రహ్మాను అలల్ అర్షిస్తవా, యా మన్ లైస కమిస్లిహి షైవున్, వహువస్సమీవుల్ బసీర్, అస్అలుక అన్ తుసల్లియ అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్” ఆ తరువాత మీ కోరికలను కోరుకోవాలి, ఇన్షాఅల్లాహ్ తప్పకుండా ఆమోదించబడతాయి.
6. ఇమామ్ సాదిఖ్[అ.స] ఉల్లేఖించిన సలవాత్. “అల్లాహుమ్మ యా అజ్వద మన్ అఅతా....” ను చదవాలి.
7. దుఆయె “ఉమ్మె దావూద్”ను చదవాలి.
8. దుఆయె “అరఫహ్” చదవాలి.
9. జియారతె “జామిఅహ్ కబీరహ్” చదవాలి.[మఫాతీహుల్ జినాన్, పేజీ453-480].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.
 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Mashallah.....
Shukriya qibla.
Jazakallah Khair.

Submitted by zaheer on

Shukriya himmat afzaei ka.
Aap apne mufeed mashweron se site ki behtari k liye rahnumaaei bhi kar sakte hain.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12