దైవప్రవక్త[స.అ]ను కష్టం కలిపించటం

గురు, 03/21/2019 - 05:58

ఏ విషయం దైవప్రవక్త[స.అ]ను కష్టం కలిగిస్తుంది అన్న విషయం పై ఒక రివాయత్ నిదర్శనం.

దైవప్రవక్త[స.అ]ను కష్టం కలిగించినట్లు

“ఉమర్ ఇబ్నె షాస్ అస్లమీ” ఇతడు హుదైబియహ్ సహాబీయులకు చెందిన వారిలో ఒకరు, ఇతను ఇలా ఉల్లేఖించెను: ఒకసారి నేనూ మరియు హజ్రత్ అలీ[అ.స] ఇద్దరు కలిసి “యమన్” వైపుకు ప్రయాణం చేస్తుండగా, ప్రయాణం మధ్యలో నా మరియు వారి మధ్య ఏదో విషయం పై అభిప్రాయబేధం ఏర్పడింది, దాంతో నాలో అలీ[అ.స] పట్ల శత్రుత్వం ఏర్పడింది. తిరిగి వచ్చిన తరువాత నేను మస్జిద్ కు వెళ్ళి అలీ[అ.స] ప్రవర్తన గురించి (ఇతరులకు) చెప్పాను, మెల్లమెల్లగా నా మాటలు దైవప్రవక్త[స.అ] వరకు చేరాయి. రెండవ రోజు నేను మస్జిదులో ప్రవేసించినప్పుడు దైవప్రవక్త[స.అ] సహాబీయులతో కలిసి కూర్చుని ఉన్నారు. వారు నన్ను చూస్తూనే ఉన్నారు చివరికి నేనూ కూర్చున్నాను. నన్ను చూసి దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా, ఉమర్! నీవు నన్ను కష్టపెట్టావు”.
నేను: మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే అల్లాహ్ (ఆగ్రహం) నుండి రక్షణ కోరుతున్నాను.
దైవప్రవక్త[స.అ]: ఔను, నువ్వు నన్ను కష్టం కలిగించావు, ఎందుకంటే ఎవరైతే అలీ[అ.స]ను కష్టపెడతాడో అతడు నన్ను కూడా కష్టం కలిగించినట్టు.[ముస్తద్రికుస్ సహీహైన్, భాగం3, పేజీ122]

రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, ఈౙా అధ్యాయం.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir on

Mashallah,
Agha "NEXT" button is not working. With this we are notable to read the next page topics.
Shukriya.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 43