జన్నతుల్ బఖీ సమాధులు

ఆది, 05/31/2020 - 14:37

జన్నతుల్ బఖీ స్మశానంలో ఎవరెవరి సమాధున్నాయి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

జన్నతుల్ బఖీ సమాధులు

“జన్నతుల్ బఖీ” స్మశానం మదీనహ్ మునవ్వరహ్(సౌదీ అరేబీయ)లో ఉన్న గొప్ప స్మశానం. ఈ స్మశానంలో ఇస్లాం ఆరంభం నాటి దైవప్రవక్త[స.అ] అతి ఉత్తమ సహాబీ మరియు వారి అహ్లెబైత్[అ.స] ముఖ్యంగా దైవప్రవక్త[స.అ] వారి ఉత్తరాధికారులలో కొందరు ఉదాహారణకు హజ్రత్ ఇమామ్ హసన్[అ.స], హజ్రత్ ఇమామ్ జైనుల్ అబెదీన్[అ.స], హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] మరియు హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] కూడా ఈ స్మశానంలోనే సమాధి చేయబడ్డారు. ఒక ఆధారం ప్రకారం హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] సమాధి కూడా జన్నతుల్ బఖీలోనే ఉంది అని నిదర్శిస్తుంది. వీరే కాకుండా ఇస్లామీయ ప్రపంచానికి సంబంధించిన దైవప్రవక్త[స.అ] గొప్ప గొప్ప సహాబీయులు మరియు వారి బంధువులు చాలా మంది అక్కడ సమాధి చేయబడ్డారు. ఉదాహారణకు దైవప్రవక్త[స.అ] పినతండ్రి అయిన జనబె అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్, దైవప్రవక్త[స.అ] యొక్క పిన్నీ మరియు హజ్రత్ అలీ యొక్త తల్లి అయిన జనబే ఫాతెమా బింతె అసద్, అఖీల్ ఇబ్నె అబీ తాలిబ్, ముహమ్మదె హనఫియ్యహ్, హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్[అ.స] యొక్క తల్లి జనాబె ఉమ్ముల్ బనీన్, ఇస్మాయీల్ ఇబ్నె ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స], అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫరె తయ్యార్, వీళ్లందరూ అక్కడే సమాధి చేయబడ్డారు. వీళ్ళ సమాధుల పై రౌజా(గోపురం) ఉండేవి. ఈనాడు కూడా కొందరి వద్ద వాటి చిత్రాలు ఉన్నాయి. ఇంటర్ నెట్ లో కూడా చూడవచ్చు. ఈ గోపురాలు మరియు ఈ రౌజాలు షవ్వాల్ నెల 8వ తేదీ, 1344 హిజ్రీ వరకు ఉండేవి.[ఇన్హెదామె జన్నతుల్ బఖీ, పేజీ12]

రిఫరెన్స్
హమీదుల్ హసన్, ఇన్హెదామె జన్నతుల్ బఖీ; ఎక్ తారీఖీ అలమియ, అర్ష్ అసోసియేషన్, లఖ్నౌ, జులాయి2017.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17