రమజాన్ మాసం యొక్క 13వ రోజు దుఆ భావర్ధాలు

ఆది, 04/25/2021 - 18:15

రమజాన్ మాసం యొక్క 13వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 13వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దుఆ: అల్లాహుమ్మా తహ్హిర్ ని ఫీహి మినద్ దనసె వల్ అఖ్ జార్, వ సబ్బిర్నీ ఫీహి అలా కాయినాతిల్ అఖ్దార్, వ వఫ్ఫిఖ్నీ ఫీహి వత్ తుఖా వ సుహ్బతిల్ అబ్రార్, బి ఔనిక యా ఖుర్రత ఐనిల్ మసాకీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో అపవిత్రత మరియు అశుద్ధతల నుండి దూరం చేసి పవిత్రుడని చేయి. ప్రపంచ దైవనియోగముల పట్ల నాకు సహనం ప్రసాదించు. నీ సహాయ(గుణం) ద్వార నన్ను ధర్మనిష్ఠ కలిగిఉండే మరియు మంచి వారితో కలిసిఉండే సామర్థ్యన్ని ప్రసాదించు, ఓ నిస్సహాయుల కళ్ళ యొక్క కాంతి!

ఈ దుఆలో మనం అల్లాహ్ ను వేడుకుంటున్న అంశాల వివరణ:
మొదటి అంశం: ఓ అల్లాహ్! పవిత్రత ప్రసాదించు
రమజాన్ మాసం యొక్క 13వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మనం అల్లాహ్ ను అపవిత్రత మరియు అశుద్ధతల నుండి దూరం చేసి పవిత్రులుగా తీర్చిదిద్దూ అని వేడుకుంటున్నాము. పవిత్రత కోసం దూఆతో పాటు మనిషి ప్రయత్నం కూడా అందులో ముఖ్యపాత్ర వహిస్తుంది. నిజానికి అల్లాహ్ పవిత్రత పొందడానికి చాలా స్పష్టమైన పరిష్కారాలు సూచించాడు.  
1. ఇస్తగ్ఫార్ మరియు అల్లాహ్ వైపుకు మరలింపు
మనిషి పవిత్రతలో అత్యుత్తమ ప్రభావం చూపే వాటిలో తౌబహ్ మరియు ఇస్తిగ్ఫార్ ఒకటి. రివాయతలనుసారం ఇస్తిగ్ఫార్, పాపముల నుండి విముక్తి చెందడానికి ఉపయోగపడే అమృతం లాంటిది. ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “నీ పాపముల చెడువాసన నిన్ను అవమానించ కుండా ఉండేందుకు నిన్ను నువ్వు ఇస్తిగ్ఫార్ మరియు తౌబహ్ ద్వార సుగంధాన్ని పోసుకో”[2] రమజాన్ మాసం అల్లాహ్ ఆతిథ్యమాసం ఈ మాసంలో ఇస్తిగ్ఫార్ చేసి పవిత్రతను పొందడం ఇతర మాసముల కంటే సులువైనది. దైవప్రవక్త(స.అ) షాబాన్ నెలకు సంబంధించిన ఉపన్యాంలో రమజాన్ మాసంలో ఇస్తిగ్ఫార్ యొక్క ప్రాముఖ్యత గురించి ఇలా వివరించారు: “ప్రజలారా! నిస్సందేహంగా మీ ప్రాణాలు మీరు చర్యలతో ముడి పడి ఉన్నాయి; అయితే వాటిని ఇస్తిగ్ఫార్ ద్వారా స్వాతంత్ర్యాన్ని ప్రసాదించండి”[3]
ఇస్తిగ్ఫార్ ప్రభావాలు మరియు అనుగ్రహాలు:
ఆయతులలో మరియు రివాయతులలో ఇస్తిగ్ఫార్ యొక్క ప్రత్యేక ప్రభాల గురించి వివరించబడి ఉంది ఉదాహారణకు సమాజ సత్ సమాజం, అల్లాహ్ అనుగ్రహాల అవతరణ, ఇహపరలోక శిక్ష నుండి విముక్తి, శ్రేయస్సు మరియు దీర్ఘ జీవితం మొ..

2. ఎహ్సాన్ మరియు సత్కార్యం:
పాపముల నుండి విముక్తి చెంది పవిత్ర పొందడానికి కారణమయ్యే వాటిలో మరోకటి ఎహ్సాన్ మరియు సత్కార్యములు చేయడం. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు-రాత్రి ఘడియలలో కూడా! నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం”[సూరయె హూద్, ఆయత్114]

రెండవ అంశం: ఓ అల్లాహ్! నాకు సహనాన్ని ప్రసాదించు
రెండవ వాక్యంలో మేమ అల్లాహ్ ను ఓ అల్లాహ్! ప్రపంచ దైవనియోగముల పట్ల మనకు సహనాన్ని ప్రసాదించు అని వేడుకుంటున్నాము. ఈలోకాన్ని సృష్టించిన విధానాన్ని బట్టి ఇందులో కష్టాలు, కొరతలు, ఆపదలు లాంటివి నిత్యం మనిషి జీవితంలో ఉంటూ ఉంటాయి. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు (కలిమి లేములకు) గురిచేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు”[సూరయె అంబియా, ఆయత్36] ఎవరైతే ఈ కష్టాల పట్ల సహనశీలిగా ఉంటారో వారే సాఫల్యం పొందగలరు. ఇటువంటి వారికి కష్టాలు అల్లాహ్ ఆరాధనకు అడ్డురావు.[4]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ఈ మూడు విషయాలు కలిగి ఉన్న వారికి అల్లాహ్ ఇహపరలోకాల మంచిని కలిపిస్తాడు; విధి పట్ల సమ్మతం, ఆపదల పట్ల సహనం మరియు ఎటువంటి పరిస్థితులలోనైనా దుఆ చేయడం”[5]

మూడవ అంశం: ఓ అల్లాహ్ ధర్మనిష్టను ప్రసాదించు
రమజాన్ మాసం యొక్క 13వ రోజు యొక్క 3వ వాఖ్యంలో మేము అల్లాహ్ ను ఆయన సహాయ(గుణం) ద్వార మమ్మల్ని ధర్మనిష్ఠ కలిగిఉండే మరియు మంచి వారితో కలిసిఉండే సామర్థ్యన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము.
ధర్మనిష్ట కలిగి ఉండడం వల్ల కలిగే కొన్ని ప్రభావాలు: 1. హిదాయత్(రుజుమార్గం) 2. న్యాయ అన్యాయాల మధ్య తేడా తెలిస్తుంది 3. అల్లాహ్ మిత్రత్వం మరియు సామిప్యం 4. సందేహాల, కష్టాల మరియు ఆపదల నుండి విముక్తి.

ఓ అల్లాహ్ మనల్ని దర్మనిష్ట, సహనం మరియు క్షమించబడిన వారిలో నిర్ధారించు మరియు సజ్జనులకు ప్రసాదించే భాగ్యాన్ని మాకూ ప్రసాదించు.

రిఫరెన్స్
1. అల్ ఇఖ్లాల్ బిల్ అఅమాలిల్ హసనహ్ (తా-అల్ హదీసహ్), బాగం1, పేజీ288
2,3. ఉయూను అఖ్బార్ అల్ రిజా(అ.స), భాగం1, పేజీ296
4. మజ్మఅల్ బయాన్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్, భాగం7, పేజీ74-75
5. బిహారుల్ అన్వార్(తా-బీరూత్), భాగం68, పేజీ156, హదీస్71

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26