మనకు తెలియని దానిని జ్ఞానులతో అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. జనాబె లుఖ్మాన్ తన కుమారునికి చేసిన మంచి సద్బోధన.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
జ్ఞానం అనగ ఎదైనా విషయం మనం తెలియడం, ఎరుక. దీనినే అరబీ భాషలో “ఇల్మ్” అంటారు మరియు జ్ఞానిని ఆలిమ్ అంటారు. అల్లాహ్ పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో “తెలిసినవాడు మరియు తెలియని వాడు ఇద్దరూ సమానులు కాదు” అని స్పష్టంగా నిర్ధారించిన విషయం మనకు తెలిసిందే. మేము జ్ఞాని అయి ఉండాలి లేదా మనకు జ్ఞానమిత్రత్వం అయిన కలిగి ఉండాలి అంటే జ్ఞానం కోసం జ్ఞానులతో కలిసి ఉండాలి, వారి ఉపన్యాసాలను వింటూ ఉండాలి. ఈ పరిధిలోనే హదీస్ రూపంలో మన వద్దకు చేరిన జనాబె లుఖ్మాన్ తన కుమారునికి చెప్పిన ఒక మంచి మాట: “నాన్నా! సభను నీ రెండుకళ్ళతో, చాలా తెలివిగా ఎన్నుకో, ఒకవేళ నీకు అల్లాహ్ ను స్మరించే సమూహం గనుక కనిపిస్తే, వారితో పాటు చేరిపో; ఎందుకంటే ఒకవేళ నీవు జ్ఞానివై ఉంటే నీ జ్ఞానం నీకు లాభాన్నిస్తుంది మరియు నీ జ్ఞానం కూడ పెరుగుతుంది, ఒకవేళ నీవు అజ్ఞానివి అయి ఉంటే నీకు విద్యను నేర్పుతారు, అల్లాహ్ వారి పై తన కారుణ్యం కురిపిస్తాడు, బహుశ అది నీకు కూడా దక్కవచ్చు”[బిహారుల్ అన్వార్, భాగం13, పేజీ417, హదీస్10].
రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... Iltemase Dua.
వ్యాఖ్యానించండి